కామారెడ్డిలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది.
అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే. తాజాగా అదృశ్యమైన ఎస్సై మృతదేహం కూడా దొరికింది. కానిస్టేబుల్ శృతితో వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?…చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు!
కామారెడ్డి జిల్లా బీబీపేట్ ఎస్సైగా సాయి కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అదే పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. అప్పటికే ఎస్సైకి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండగా.. అప్పటికే శృతికి పెళ్ళై విడాకులు అయినట్లు తెలుస్తోంది.
ఎస్సై బదిలీ పై బిక్కునూర్ రావడంతో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో శృతికి సన్నిహితం పెరిగింది.. ఈ విషయం తెలిసిన ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.