హాస్టల్‌ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం.. క్యాబ్‌ డ్రైవర్‌ను కత్తితో పొడిచి..

www.mannamweb.com


మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి దారుణం (Murder) చోటుచేసుకున్నది. ఓ మహిళ కోసం ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం బలి తీసుకున్నది. ప్రియురాలు తనకే దక్కాలని భావించిన ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచి చంపేశాడు.

మేడిపల్లి పరిధిలోని మల్లికార్జుననగర్‌లో ఉన్న ఓ బాయ్స్‌ హాస్టల్‌లో ఈ ఘటన వెలుగులు చూసింది.

జనగామకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ మహేందర్‌ రెడ్డి (38)ని అదే హాస్టల్‌లో ఉంటున్న కిరణ్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేశాడు. వంటకు ఉపయోగించే గంటెతో దాడి చేసి కత్తితో పొడిచి హతమార్చాడు. మహేందర్ రెడ్డి గతంలో ఇదే హాస్టల్లో ఉండేవాడు. ఆసయంలో హాస్టల్ నిర్వాకురాలితో సన్నిహితంగా ఉండేవాడు. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే హాస్టల్‌ ఖాళీచేసిన మహేందర్ రెడ్డి.. ప్రస్తుతం జనగామలో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు హాస్టల్‌కి వచ్చి వెళ్తుండేవాడు. కాగా, గత కొంతకాలంగా హాస్టల్ నిర్వాహకురాలు కిరణ్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నది.

శుక్రవారం అర్ధరాత్రి జనగామ నుంచి హాస్టల్‌కు వచ్చిన మహేందర్ రెడ్డి.. ఇదే విషయమై కిరణ్‌తో గొడవకు దిగాడు. దీంతో రెచ్చిపోయిన కిరణ్ వంట సామగ్రితో అతనిపై దాడి చేశాడు. అనంతరం అక్కడే ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కిరణ్ రెడ్డి, హాస్టల్ నిర్వహకురాలని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.