ప్రస్తుతం ల్యాప్‌టాప్ వినియోగం అనివార్యంగా మారింది. కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ల్యాప్‌టాప్‌లు ఉపయోగించాల్సి పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత ల్యాప్‌టాప్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో మార్కెట్లో కొంగొత్త ల్యాప్‌టాప్స్ హల్చల్ చేస్తున్నాయి..
అయితే ల్యాప్‌టాప్ అంటే ధరతో కూడుకున్న అంశమని తెలిసిందే. అందుకే చాలా మంది ట్యాబ్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ట్యాబ్ ధరకే, ఆ మాటకొస్తే ట్యాబ్ కంటే తక్కువ ధరకే ల్యాప్‌టాప్ లభిస్తే భలే ఉంటుంది కదూ! ఇలాంటి వారి కోసమే అమెజాన్‌లో ఓ మంచి ఆఫర్ లభిస్తోంది. కేవలం రూ. 11 వేలకే ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఏంటా ల్యాప్‌టాప్, దాంట్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పడు తెలుసుకుందాం..
వాకర్ నోట్ బుక్ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్ లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 30 వేలు కాగా, ప్రస్తుతం ఏకంగా 57 శాతం డిస్కౌంట్‌తో రూ. 12,990కి సొంతం చేసుకోవచ్చు. అయితే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1750కే సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 11 వేలకు పొందొచ్చు. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయానికొస్తే..
వాకర్ నోట్‌బుక్ ల్యాపటాప్‌లో 14.1 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 4జీబీ ర్యామ్‌తో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్ వస్తోంది. జెమిని లేక్ సెలెరన్ ఎన్4020 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇక ఈ ల్యాప్‌టాప్ బరువు 1.3 కిలోలు కాగా, 16.9 ఎమ్‌ఎమ్ థిక్‌నెస్‌తో డిజైన్ చేశారు. ఇందులో 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీని అందించారు. బ్లూటూత్ 4.0 వెర్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యటారీని అందించారు. 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన వెబ్ క్యామ్‌ను అందించారు.