Personality Test: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?
ప్రపంచ నలుమూలల ‘ఫేస్ రీడింగ్’ నిపుణులు చాలామందే ఉన్నారు. వీరంతా కూడా మీ ముఖం ఆకృతిని బట్టి.. మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంటారు. అలాగే మీ ముఖం చూసి.. మీ ఆలోచనలు చెప్పొచ్చునన్నది ఇంగ్లీష్ సామెత. అవునండీ.! మీ జీవితంలో మీరు ఎదుర్కునే సవాళ్లను సైతం మీ ముఖం ఆకృతిని బట్టి తెలుసుకోవచ్చునట. జీన్ హానర్ అనే ఫేస్ రీడింగ్ ఎక్స్‌పర్ట్.. ముఖం ఆకారాన్ని బట్టి.. వారి లక్షణాలు చెప్పొచ్చునని తెలిపారు. దానితో వారి వ్యక్తిత్వాన్ని కూడా చెప్పేయొచ్చునట. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
గుండ్రని ముఖం:
మీది గుండ్రని ముఖం అయితే.. మీరు ఎంతో దయతో, ఉదారంగా ఉంటారట. అలాగే ఇతరులకు మీరు ఎంతగానో విలువనిస్తారు. ఇతరులను చెప్పేది వింటూ.. వారిని నొప్పించకుండా.. వారితో చాలా సున్నితంగా మాట్లాడతారట. అమాయకంగా, ఏది ఆశించకుండా ఉండే మీ గుణాల వల్ల.. అప్పుడప్పుడూ ఇతరుల చేతిలో మీరు మోసపోతుంటారు
హార్ట్ ఫేస్:
వీరిది చాలా క్రియేటివ్ మైండ్. అలాగే స్ట్రాంగ్ మెంటాలిటీ. సామాజికంగా చురుగ్గా ఉండటమే కాకుండా.. లీడర్‌షిప్ క్వాలిటీలు ఎక్కువగా ఉంటాయి. ప్రతీ విషయంలోనూ లోతుగా ఆలోచిస్తారు. అలాగే సరికొత్త థాట్స్‌ను గ్రహించడంలో మీరే ముందుంటారు.
కోల మొహం:
వీరు చాలా తెలివైనవారు, ఆచరణాత్మకంగా, పద్దతిగా ఉంటారు. ఒకటి అనుకుంటే.. అది సాధించేవారు విడిచిపెట్టరు. మీకు ఐక్యూ ఎక్కువ. అలాగే ఇతరులను ఈజీగా ఆకర్షించుకుంటారు.
చతురస్రాకార మొహం:
వీరు ఎప్పుడూ యాక్టివ్‌గా, ఎలప్పుడూ పోటీపడే స్వభావంతో ఉంటారు. అలాగే మీలో బిజినెస్‌మెన్ లక్షణాలు చాలా ఎక్కువ. మీలో తెలివి ఎక్కువ. ఒత్తిడిలో ఉన్నా.. మీరు కూల్‌గా పని చేయగలరు.