ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన 150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది.
ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన 150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయింది. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు తదితరులు ఇక్కడ పలు చిత్రాలను రూపుదిద్దారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రహీరోల సినిమాలను చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు తదితర చిత్రాల్లో ముఖ్యమైన సన్నివేశాలు ఇక్కడే నిర్మాణం జరుపుకొన్నాయి. సినీ చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. ఏటా వరదలకు గట్టు కొద్దికొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోయింది
Beta feature