తారక్‌ని టార్చ్ బేరర్ అంటున్నారు నందమూరి అభిమానులు. నిన్నమొన్నటిదాకా అందరూ భయపడుతున్న ఆ సెంటిమెంట్‌కి బ్రేకులు వేసేశారు జూనియర్ ఎన్టీఆర్. నేను నడిస్తే అది నయా రూటే అవుతుందనే మాటను..
మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు తారక్. దేవర రిలీజ్ కావడానికి ముందు వరకూ అందరిలోనూ ఒకటే టెన్షన్. జక్కన్న చేసిన హీరోలకు ఇమీడియేట్ సక్సెస్ ఉండదు కదా..
తారక్‌ని టార్చ్ బేరర్ అంటున్నారు నందమూరి అభిమానులు. నిన్నమొన్నటిదాకా అందరూ భయపడుతున్న ఆ సెంటిమెంట్‌కి బ్రేకులు వేసేశారు జూనియర్ ఎన్టీఆర్. నేను నడిస్తే అది నయా రూటే అవుతుందనే మాటను.. మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు తారక్.
దేవర రిలీజ్ కావడానికి ముందు వరకూ అందరిలోనూ ఒకటే టెన్షన్. జక్కన్న చేసిన హీరోలకు ఇమీడియేట్ సక్సెస్ ఉండదు కదా.. ఆ సెంటిమెంట్ దేవరకు ఎలాంటి రిజల్ట్ తెచ్చిపెడుతుందో అని.. కానీ ఇప్పుడు దేవర కలెక్షన్లు చూస్తున్నవారు తారక్ ఈజ్ డిఫరెంట్.. ఆయన సెంటిమెంట్‌ని బ్రేక్ చేశారు అని హ్యాపీగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొరటాలకే కాదు, గతంలోనూ కెప్టెన్లకు కెరీర్ బ్రేక్ ఇచ్చిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.
మహేష్ హీరోగా నటించిన ఒన్ నేనొక్కడినే బాగా ఆడలేదు సుకుమార్‌కి. ఆ తర్వాతే ఆయన తారక్‌తో నాన్నకు ప్రేమతో తీసి సక్సెస్ చూశారు. పూరి జగన్నాథ్ కెరీర్‌లో టెంపర్ క్రేజ్‌ని, ఆ మూవీకి వచ్చిన కలెక్షన్లనీ అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు.
దేవరకు ముందు తారక్ చేసిన సోలో అరవింద సమేత. త్రివిక్రమ్ ఈ సెట్స్ కి వచ్చే టైమ్‌కి ఆయన ఖాతాలో అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ ఉంది. అయినా తారక్, పూజతో చేసిన అరవింద సమేత మేజిక్ వర్కవుట్ అయింది.
ఇటు బాబీ కెరీర్‌లోనూ జై లవకుశకి స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ కన్నా ముందు ఆయన పవర్‌స్టార్‌తో చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా తారక్‌తో చేసిన జై లవకుశ మంచి కలెక్షన్లతో బాబీకి హిట్ అందించింది. కొరటాల సక్సెస్ అందుకున్న ఈ టైమ్‌లో… గతంలో ఇతర కెప్లెన్లకు తారక్ బ్రేక్ ఇచ్చిన తీరు గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.