FASTag New Rules: ఇకపై FasTag తో పని లేదు కేంద్రం కీలక నిర్ణయం

FASTag New Rules: భారతదేశంలో టోల్ వసూలు ప్రక్రియలో విప్లవాత్మక మార్పు, మే 1, 2025 నుండి GPS-based toll system ప్రవేశపెట్టనున్నారు. NHAI ఫాస్టాగ్ స్థానంలో ఈ కొత్త విధానం తీసుకురానుంది.


భారతదేశంలో జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియలో ఒక విప్లవాత్మకమైన అప్‌గ్రేడ్ మే 1, 2025 నుండి ప్రవేశపెట్టనున్నారు. National Highways Authority of India (NHAI) ఫాస్టాగ్ వ్యవస్థను (FASTag) దశలవారీగా తొలగించి, దాని స్థానంలో GPS-based toll collection systemని తీసుకురాబోతోంది. రోడ్డు ప్రయాణాన్ని సులభతరం, వేగవంతం చేయడంతో పాటు transparencyని తీసుకురాలన్న ఉద్దేశంతో ఈ ప్రాసెస్ చేయనున్నారు.

FASTag వల్ల టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గింది. కానీ దీని వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. పొడవైన క్యూలు, technical glitches, ట్యాగ్‌ల misuse వంటి సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి, టోలింగ్‌లో global standardsని తీసుకురావడమే GPS-based toll systemని ప్రవేశపెట్టడానికి కారణం.

ఈ కొత్త వ్యవస్థలో ప్రధాన అంశాలు:

  1. Distance-based tolling – డ్రైవర్ ఎంత దూరం ప్రయాణించాడో దాని ఆధారంగా టోల్ వసూలు.
  2. No stopping at toll booths – వేచి ఉండే సమయం తగ్గుతుంది.
  3. Reduced human errors & fraud – మాన్యువల్ టోల్ తప్పులు మరియు మోసాలను నివారిస్తుంది.
  4. Seamless & contactless driving experience – సున్నితమైన మరియు స్పర్శరహిత ప్రయాణ అనుభవం.

GPS-based toll system ఎలా పనిచేస్తుంది?

ఈ సిస్టమ్ GPS technologyని ఉపయోగించి వాహనాల కదలికను ట్రాక్ చేస్తుంది. దీనితో పాటు, ANPR (Automatic Number Plate Recognition) cameras మరియు వాహనంలో అమర్చిన GPS devicesని ఉపయోగించి రియల్-టైమ్‌లో టోల్ ఛార్జీలను లెక్కిస్తుంది.

వాహన యజమానులకు ఈ వ్యవస్థతో కలిగే ప్రయోజనాలు:

  1. Pay-as-you-use model – ప్రయాణించిన దూరం ప్రకారం ఛార్జీ.
  2. No queues or slowdowns – టోల్ ప్లాజాల వద్ద ఆగనవసరం లేదు.
  3. Auto-debit from linked bank account – టోల్ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతా నుండి కట్ అవుతుంది.
  4. Digital tracking – ప్రయాణ వివరాలు మరియు చెల్లింపులను డిజిటల్‌గా ట్రాక్ చేయగలరు.

FASTag వినియోగదారులు తెలుసుకోవలసినవి:

  • FASTagని మే 1, 2025 వరకు ఉపయోగించవచ్చు.
  • కొత్త government-approved GPS deviceని వాహనంలో ఇన్‌స్టాల్ చేయాలి.
  • బ్యాంక్ ఖాతాను కొత్త సిస్టమ్‌కు link చేయాలి.
  • కొత్త సిస్టమ్‌కు మైగ్రేట్ అయిన తర్వాత, FASTag స్టిక్కర్ని తీసివేయాలి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.