ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్‌రోడ్డులో రాజుగారి మెట్ట దగ్గర బస్సు అదుపు తప్పి లోయలో పడింది.
ఈ ఘటనలో 15మంది చనిపోయినట్లు తెలుస్తోంది.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, స్థానికులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాద స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రైవేటు బస్సులో యాత్రికులు భద్రాచలంలో ఆలయ దర్శనం ముగించుకుని కాకినాడ జిల్లా అన్నవరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

































