కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

ర్నూలు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటకకు చెందిన ఓ కారు ఎమ్మిగనూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా కోటేకల్‌ గ్రామంలోని కొండ మలుపు దగ్గర ఆదోని నుంచి వస్తున్న మరో కారును ఢీ కొట్టింది.


ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మరికొందరికీ గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల కర్నూలు జిల్లాలోనే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమై 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అక్టోబర్ 24వ తేదీన చోటుచేసుకుంది. రోడ్డు మధ్యలో ఉన్న ఓ మోటార్ సైకిల్ ను ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో కొంతమంది గాయాలతో బయటపడగా, 19 మంది స్పాట్ లోనే మృతి చెందారు. ఇక ఆ ప్రమాదం మరువక ముందే ఇప్పుడు అదే కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.