ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. నానబెట్టి ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ హాంఫట్..

www.mannamweb.com


మన వంటగదిలో ఎన్నో రకాల ఔషధాలున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. రోజూ.. జీలకర్ర, ఆవాలు, మిరియాలు, లవంగాలు వంటి వివిధ రకాల మసాల దినుసులను మనం వంటలలో ఉపయోగిస్తాము. వీటితో పాటు మెంతి గింజలు కూడా చాలా ముఖ్యమైనవి. మెంతులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మన వంటగదిలో ఎన్నో రకాల ఔషధాలున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. రోజూ.. జీలకర్ర, ఆవాలు, మిరియాలు, లవంగాలు వంటి వివిధ రకాల మసాల దినుసులను మనం వంటలలో ఉపయోగిస్తాము. వీటితో పాటు మెంతి గింజలు కూడా చాలా ముఖ్యమైనవి. మెంతులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మెంతులు రక్తాన్ని పల్చగా మార్చడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులను కూడా దూరం చేసే శక్తి మెంతులకు ఉంది. అలాగే మూత్రనాళం, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, మెంతులను నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

మెంతి గింజలను వేడి నీటిలో రాత్రంతా నానబెట్టి, లేదా గోరువెచ్చని నీటిలో మరిగించి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల 5 అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి..

జీర్ణక్రియకు మంచిది: మెంతులు సహజ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. ఎసిడిటీ, గ్యాస్ వంటి అజీర్ణ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతి నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలం, చలికాలంలో నానబెట్టిన మెంతి నీటిని తాగడం మంచిది.

కొలెస్ట్రాల్: మెంతి నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. మెంతులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్స్‌లో పుష్కలంగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో బాధపడేవారు ఈ హెల్తీ డ్రింక్‌ని రోజూ తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

నెలసరి సమస్యలు: మెంతులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలు ఋతు (పీరియడ్స్) తిమ్మిరితో సహా ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మెంతి నీళ్లలోని ఆల్కలాయిడ్స్ రుతుక్రమ నొప్పిని గణనీయంగా తగ్గించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి.

బరువు తగ్గుతుంది: మెంతులు కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. డైట్ చేసేవారు మెంతి నీటిని ఖాళీ కడుపుతో డిటాక్స్ డ్రింక్‌గా తీసుకోవచ్చు. అయితే వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

జుట్టు – చర్మం: మెంతుల్లో డయోస్జెనిన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.

మెంతులను ఇలా నానబెట్టండి..
1 గ్లాసు వేడి నీటిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి గట్టిగా మూత పెట్టండి. రాత్రంతా నాననివ్వండి. ఉదయాన్నే ఆ నీటిని ముందుగా తాగాలి. తర్వాత మెంతి గింజలను నమిలి తినాలి.. మెంతులు చాలా చేదుగా ఉంటే ఆ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీటిని మాత్రమే తాగండి..