భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర మంత్రివర్గం గుడ్‌న్యూస్ చెప్పింది. రేణిగుంట – కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 1,332 కోట్లు ఖర్చు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. డబ్లింగ్ పనులతో రాయలసీమ ప్రాంతానికి మొత్తం చాలా లబ్ధి చేకూరుతుందన్నారు కేంద్ర మంత్రి.
దూరం తక్కువే అయినప్పటికి ఈ లైన్ చాలా కీలకమన్నారు అశ్విని వైష్ణవ్. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలు, తమిళనాడులోని వెల్లూరు వరకు ఈ ప్రాజెక్ట్ కీలకమన్నారు. పర్యాటక రంగంతో పాటు పారిశ్రామికాభివృద్దికి ఈ ప్రాజెక్ట్ దోహదం చేస్తుందన్నారు. తిరుపతి -పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో 104 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్ర , తమిళనాడు రెండు రాష్ట్రాలకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగమన్నారు అశ్విని వైష్ణవ్.