ఆ ఉద్యోగులకు పండుగలాంటి వార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ పద్ధతిలో పనిచేస్తున్న12055 ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పొడిగించింది.


వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వారి సేవలను పొడిగిస్తూ రేవంత్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వారి సేవల పొడిగింపు జరగకపోవడంతో సాంకేతిక కారణాలతో జీతాలు ఆగిపోయాయి. జీవో జారీతో వారి మూడు నెలల పెండింగ్ జీతాల ప్రాసెసింగ్ పూర్తికానుంది. ఆర్థిక శాఖ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు నిధులు చేరాయి. నేడో, రేపో ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.