Karthik Files One Crore Defamation Case Against Ex Wife Suchitra: సింగర్ సుచిత్రకు సంబంధించిన వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆమె తన మాజీ భర్తపై చేసిన ఆరోపణల నేపథ్యంలో అతడు లీగల్ నోటీసులు పంపాడు. ఈ మేరకు ఆమెపై పరువు నష్టం కేసు వేశాడు. ఇంతకీ ఆమె ఏ వాఖ్యలు చేసినందుకు పరువునష్టం కేసు వేశాడు. ఎంత వేశాడు అనే విషయానికొస్తే..
సింగర్ సుచిత్రం ఈ మధ్య ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ప్లే బ్యాక్ సింగర్‌గా రంగం ప్రవేశం చేసిన ఆమె.. ఆ తర్వాత కోలీవుడ్‌లో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో తన సాంగ్‌లతో ఫుల్ క్రేజ్ అండ్ పాపులారిటీ సంపాదించుకుంది. మన్మధన్, కాక్క కాక్క, జేజే, పోకిరి, వల్లవన్ వంటి సినిమాల్లో తన స్వరంతో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించింది. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో పాడి ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.
అంతేకాకుండా ఓ వైపు సింగర్‌గా చూస్తూ మరోవైపు సినిమాల్లో కూడా నటించింది. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనదైన శైలిలో దూసుకుపోయింది. అయితే తన కెరీర్ పీక్స్‌లో ఉందన్న సమయంలో ‘సుచి లీక్స్’ పేరుతో కోలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించింది. సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోలను, వీడియోలను లీక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఇదే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడింది. అంతేకాకుండా తన మాజీ భర్త నటుడు కార్తీక్ కుమార్‌పై కూడా పలు ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే తన మాజీ భర్త ‘గే’ (స్వలింగ సంపర్కుడు) అంటూ ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. అంతేకాకుండా నటుడు ధనుష్, కార్తీక్ కలిసి అర్థరాత్రి మగవాళ్లతో పార్టీలు చేసుకుంటారని తెలిపింది. అయితే ఈ వార్తలపై ఆ మధ్య సింగర్ సుచిత్ర మాజీ భర్త కార్తీక్ స్పందించిన విషయం తెలిసిందే.
‘‘నేను గే నా? ఒకవేళ స్వలింగ సంపర్కుడిని అయ్యుంటే దాన్ని బయటకు చెప్పుకోవడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు. అది ఎలాంటిది అయినా గర్వంగా చెప్పుకునే వాడిని’’ అంటూ తెలుపుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే కార్తీక్ అక్కడితో ఆగలేదు. తన మాజీ భార్య సుచిత్రకు లీగల్ నోటీసులు పంపించాడు. మోహిని షూటింగ్ టైంలో నటుడు ధనుష్‌తో తన మాజీ భర్త కార్తీక్‌కు ఉన్న రిలేషన్‌పై తనకు అనుమానాలు ఉన్నాయని.. అలాగే కార్తీక్ స్వలింగ సంపర్కుడని పేర్కొనడంతో సుచిత్రపై కార్తీక్ పరువు నష్టం కేసు వేశాడు.
తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందున రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా సుచిత్రకు మే 16న లీగల్ నోటీసులు పంపించాడు. ఈ కేసుపై మే 24న విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. ఇకనుంచి కార్తీక్‌పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా సుచిత్రపై న్యాయమూర్తి మధ్యంతర నిషేధం విధించారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు.