సీఎం రేవంత్‌రెడ్డితో భేటీకి హాజరైన సినీ ప్రముఖులు

www.mannamweb.com


తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశమయ్యారు.

సుమారు 50 మంది సినీ ప్రముఖులు అక్కడికి వచ్చారు.

ఈ భేటీకి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. నిర్మాతల్లో అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబు, కె.ఎల్‌.నారాయణ, దామోదర్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, చినబాబు, దానయ్య, కిరణ్‌, రవి, స్రవంతి రవి కిషోర్‌, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్‌, ప్రసన్న, యూవీ వంశీ, సుధాకర్‌ రెడ్డి, నాగవంశీ, సునీల్‌ – అనుపమ, గోపీ ఆచంట, సి.కల్యాణ్‌, రమేశ్‌ ప్రసాద్‌, భరత్‌ భూషణ్‌ ఉన్నారు.

దర్శకుల్లో రాఘవేంద్రరావు, కొరటాల శివ, త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడి, ప్రశాంత్‌ వర్మ, సాయి రాజేశ్‌, వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌, వీర శంకర్‌, బాబీ, వేణు శ్రీరామ్‌, వేణు యెల్దండి, విజయేంద్రప్రసాద్‌తోపాటు నటులు నాగార్జున, వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, కల్యాణ్‌ రామ్‌, శివ బాలాజీ, అడివి శేష్‌, నితిన్‌, కిరణ్‌ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, రామ్‌ పోతినేని ఈ సమాశానికి హాజరయ్యారు.