ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌: ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. ఉత్తమ నటి నివేదా థామస్‌

కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డుల (70th Filmfare Awards South) ప్రదానోత్సవం శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాకిగానూ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఉత్తమ నటుడు అవార్డు, ‘35: చిన్నకథ కాదు’ చిత్రానికిగానూ నివేదా థామస్‌ (Nivetha Thomas) ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. ఎక్కువ అవార్డులు ‘పుష్ప 2’ సినిమాకి వచ్చాయి. టాలీవుడ్‌కు దక్కిన మరికొన్ని అవార్డుల జాబితా ఇదీ (2024లో విడుదలైన సినిమాలకుగానూ)..


ఉత్తమ చిత్రం: పుష్ప 2
ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప 2)
బెస్ట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌: పుష్ప 2
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)
ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ పరిచయ నటుడు: సందీప్‌ సరోజ్‌ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ పరిచయ నటి: నయన్‌ సారిక (గం గం గణేశా)
ఉత్తమ సాహిత్యం: చుట్టమల్లె చుట్టేస్తోంది (దేవర), రచయిత: రామజోగయ్యశాస్త్రి
ఉత్తమ గాయకుడు: శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి: గుంటూరు కారం)
ఉత్తమ గాయని: శిల్పారావు (చుట్టమల్లె)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: నితిన్‌ జిహానీ (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ- మోనిక (పుష్ప 2)
బెస్ట్‌ కొరియోగ్రఫీ: శేఖర్‌ మాస్టర్‌ (కుర్చీ మడతపెట్టి)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): లక్కీ భాస్కర్‌
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజ సజ్జా
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): కాజల్‌ అగర్వాల్‌ (సత్యభామ)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.