నగరంలోని కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం( జనవరి 13వ తేదీ) రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసకుంది.
గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. భారీ ఎత్తున మంటల ఎగిసి పడుతూ ఉండటంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.


































