టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఒక చరిత్రాత్మక ఘనత సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత వికెట్ కీపర్‌గా తన పేరు నమోదు చేసుకున్నాడు.ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్-సచిన్ ట్రోఫీ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాల్గో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ ఒక గొప్ప ఫీట్‌ను సాధించాడు.
బ్రైడన్ కార్స్ వేసిన 61వ ఓవర్‌లో మూడో బంతిని లాంగాన్ వైపు సిక్సర్‌గా బాదిన పంత్, ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయిని దాటాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 93 ఏళ్ల కాలంలో ఈ ఘనతను ఏ వికెట్ కీపర్ సాధించలేదు.ఇంకా, రిషభ్ పంత్ మాత్రమే కాకుండా, విదేశాల్లో కూడా 1000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై విజిటింగ్ వికెట్ కీపర్‌గా 1000 పరుగులు దాటిన తొలి బ్యాట్స్‌మన్‌గా పంత్ నిలిచాడు. ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ (778), రాడ్ మార్ష్ (773), జాన్ వైట్ (684), ఇయాన్ హీలీ (624) తదితరులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.అయితే, 68వ ఓవర్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడిన సమయంలో పంత్ గాయపడిపోయాడు.
ఈ ఓవర్ నాలుగో బంతి శాక్‌తో పంత్ షూ తగిలింది. బంతి బలంగా తాకడంతో పాదం గాయపడి, రక్తస్రావం ఏర్పడింది. నొప్పితో బాధపడుతూ పంత్ తన పాదాన్ని నేలపై పెట్టలేకపోయాడు. వెంటనే అంబులెన్స్ సహాయంతో మైదానం బయటకు తీసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు.
పంత్ బయటకు వెళ్లడంతో జడేజా బ్యాటింగ్‌కు వచ్చారు.తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్ (151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కేఎల్ రాహుల్ (98 బంతుల్లో 4 ఫోర్లతో 46), రిషభ్ పంత్ (48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 37) విలువైన పరుగులు చేశారని చెప్పాలి.కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 12 పరుగుల్లో అవుట్ కాగా, రవీంద్ర జడేజా (19 నాటౌట్) మరియు శార్దూల్ ఠాకూర్ (19 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్ ఒక వికెట్ పొందాడు. తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు.
































