Fitness: వారానికి ఎన్ని గంటలు వ్యాయామం అవసరమో తేల్చి చెప్పిన నివేదిక..

www.mannamweb.com


ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కూడూ, గూడు, గుడ్డ అవసరం. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది. మంచి ఆహారం, రక్షిత తాగునీరు, సరైన వ్యాయామం తప్పని సరి అంటున్నారు నిపుణులు.

ఒకప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. అది నిజమే అనిపిస్తోంది. దీనికి కారణం ఏదైనా జబ్బు చేస్తే దానికి అయ్యే ఖర్చు కనీసం అంటే వేలల్లో ఉంటుంది.

రెండు వేలు ఖర్చు అయిపోయిందంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి అరనెలపాటు సరుకులు వస్తాయి. వైద్యానికి చాలా ఖరీదైపోయింది. అందుకే ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటి ఆధునిక యుగంతో యువత 70శాతానికి పైగా వ్యాయామంపై శ్రద్ద చూపడంలేదు. సరైన ఆహారం తీసుకోవడం లేదు.

ఇక మంచినీళ్లు తాగే విషయానికి వస్తే అస్సలు పట్టించుకోవడంలేదు. తద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరేప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలంటే సరైన నిద్రతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం తప్పని సరి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.

వ్యాయామానికి సరైన సమయం కేటాయించడం లేదని లాన్సెట్ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. వ్యాయామాన్ని ఐదేళ్ల వయసు నుంచే అలవరుచుకోవాలని తెలిపింది. వృద్దులైనప్పటికీ కనీసం వ్యాయామం చేయాలని సూచిస్తోంది. వ్యాయామాన్ని చేయకపోవడం వల్ల 10కోట్లకు పైగా ప్రజలు డయాబెటిస్‎కి గురవుతున్నట్లు చెబుతోంది.

పట్టుమని 30ఏళ్లు నిండకముందే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని అధ్యయనంలో వెల్లడైనట్లు చెబుతున్నారు. దేహం నిండా చెమటలు పట్టే వ్యాయామాలు, క్రీడలు అవసరమని తెలిపింది. వ్యాయామం చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ ధైర్యంగా ఉండవచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. డిప్రెషన్ , యాంగ్జైటీ, టెన్షన్, బ్రెయిన్ ప్రెజర్ నుంచి రిలీవ్ కలుగుతుందంటున్నారు మానసిక నిపుణులు.