అన్ని ప్రయాణాల మార్గాల కంటే విమాన ప్రయాణం ధర ఎంతో ఎక్కువ ధరలతో కూడుకున్నది. ప్రధానంగా ఎక్కువ దూర ప్రయాణం చేయాలంటే విమాన ప్రయాణం తప్పదు అతి తక్కువ సమయంలోనే సుదూర ప్రయాణం చేయవచ్చు.
సుఖవంతమైన ప్రయాణం కూడా ఉంటుంది. అయితే విమానా ప్రయాణం చేయాలంటే టికెట్ ధరలు ఆకాశాన్ని అంటే ధరలో ఉంటాయి. అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం అర్ధరాత్రి సమయంలో లేదా తెల్లవారుజాము సమయంలో టికెట్లు బుక్ చేయడం వల్ల తక్కువ ధరలోనే ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అయితే నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన సీట్లను అతి తక్కువ ధరలోనే ఎయిర్ లైన్స్ అందించవచ్చు. అంటే ఉదయం 12 గంటల నుంచి ఉదయం 2 గంటల మధ్యలో టికెట్ బుక్ చేసుకుంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. కాబట్టి విమాన సంస్థలు తక్కువ ధరలోనే టికెట్లను విక్రయిస్తాయి. అంతేకాకుండా ఉదయం 4 గంటల నుంచి ఉదయం 6:00 కూడా సీట్ల భర్తీ చేయడానికి స్లాట్ లపై డిస్కౌంట్ పొందవచ్చు.
ప్రధానంగా ఈ ఫ్లైట్ టికెట్లు కొన్ని రోజుల్లో తక్కువ ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మీరు టికెట్ బుక్ చేసుకునే ఆ రోజు మాత్రమే బుక్ చేసుకోండి. తద్వారా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా మంగళవారం, బుధవారం టికెట్లు అత్యల్పంగా ఉంటాయి. వారాంతాల్లో సెలవు దినాల్లో మాత్రం ఆకాశాన్ని అంటే రేట్లు పలుకుతాయి.
ఇక విదేశాలకు వెళ్లాలనుకునేవారు 3 నెలల ముందు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే తక్కువ ధరలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు డొమెస్టిక్ ప్రయాణం చేయాలనుకుంటే ఆరు వారాల ముందు బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా అందుబాటులో ఉంటాయి కానీ తక్కువ ధరలో ఉండవు. ఇక విమాన టికెట్లు బుక్ చేసుకోవడానికి అనేక యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కో యాప్ ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది. డిస్కౌంట్‌లను ప్రకటిస్తుంది. ఇప్పుడు మేక్ మై ట్రిప్, గూగుల్ ఫ్లైట్స్, స్కానర్, హోపర్ ప్లాట్ఫామ్ లలో ధర ట్రాక్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. అదనపు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
రోజుకు రూ.48తో ప్రతినెలా ఎన్ని వేల పెన్షన్ పొందవచ్చు తెలుసా?
ఫ్లైట్ టిక్కెట్ ధరలు విండో సీట్ల వద్ద ఉన్నవి ఎల్లప్పుడూ ఖరీదు. ఎయిర్లైన్స్ ఆటోమేటిక్‌గా సీట్లను కేటాయిస్తుంది. కానీ ఒక్కోసారి డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. విండో సీట్లను కూడా కాస్త ధర ఎక్కువ పెట్టి సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మీరు కూడా ఈసారి రైల్వే ఎయిర్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే కొన్ని రోజులు ముందుగానే బుక్ చేసుకోండి. అంతేకాదు అర్థరాత్రి సమయంలో బుక్ చేసుకుంటే తక్కువ ధరలోనే పొందవచ్చు. ఇక కొన్ని ప్రత్యేక యాప్లలో మొదటిసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు అదనంగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది