Foods for Thyroid: థైరాయిడ్ రాకుండా ఉండాలా.. రోజూ వీటిని తినండి చాలు!

www.mannamweb.com


శరీరంలో ఉండే అతి ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి. ఈ థైరాయిడ్ గ్రంథి శరీరంలో ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. ఈ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది.
శరీరంలో జీవక్రియలను నియంత్రించడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఈ గ్రంథి బాగా సహాయ పడుతుంది. శరీరంలో శక్తి స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథి పని తీరు చురుగ్గా ఉండాలంటే.. అయోడిన్ ఎక్కువగా అవసరం అవుతుంది. అయోడిన్ సరిగ్గా తీసుకోవడం వల్ల గ్రంథిలో లోపాలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా థైరాయిడ్ గ్రంథి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

– సూప్స్, సలాడ్స్, సుషీ వంటి ఆహారాలను తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ పని తీరు మెరుగు పడుతుంది.

– అలాగే కాడ్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలను కూడా తీసుకోవాలి. వీటిలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో థైరాయిడ్ బాగా పని చేస్తుంది.
– పాలు, పాల ఉత్పత్తుల్లో కూడా అయోడిన్ ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకున్నా.. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేస్తుంది.

– అయోడిన్ ఎక్కువగా ఉండే వాటిల్లో గుడ్లు కూడా ఒకటి. కాబట్టి ప్రతి రోజూ గుడ్డు తింటే తగిన మోతాదులో అయోడిన్ అందుతుంది.

– అదే విధగా అయోడిన్ ఉన్న ఉప్పు తీసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకును ఉప్పును మితంగా తీసుకోవడం మంచిది.

– థైరాయిడ్ గ్రంథి పని తీరును మెరుగు పరచడంలో బెర్రీలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీస్ వంటి వాటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పని తీరు మెరుగు పడుతుంది.
– ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బెర్రీలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో సలాడ్స్, స్మూతీలు చేసుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

– బీన్స్, కాయ ధాన్యలు, చిక్కుళ్లు వంటి వాటిలో కూడా అయోడిన్ ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి ఇతర పోషకాలు కూడా అందుతాయి.

– బాదం, ప్రొద్దు తిరుగుడు గింజలు, అవిసె గింజల్లో కూడా అయోడిన్ లభిస్తుంది. కాబట్టి వీటిని తీసుకున్నా సరిపోతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.