మనసు బాగోలేదా.. ఒత్తిడితో సతమతవుతున్నారా? అయితే ఫుట్ మసాజ్(Foot massage) చేయించుకోండి. అంటున్నారు రిఫ్లెక్సాలజిస్టులు(reflexologists).
ఎందుకంటే.. పరిశోధనల ప్రకారం.. అరిపాదాలపై చేతులతో రుద్దుతూ చేసే సున్నితమైన మర్దన ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని స్ట్రెస్‌కు దారితీసే కార్టిసాల్ హార్మోనల్ స్థాయిలను తగ్గిస్తుంది. రిలాక్సేషన్ రెస్పాన్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. అయితే ఫుట్ మసాజ్ ప్రభావం జంటల మధ్య మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
ఫుట్ రిఫ్లెక్సాలజీ.. ప్రయోజనాలు
*అరిపాదాలపై చేతులతో మృదువుగా తాకుతూ చేసే ఫుట్ మసాజ్ వల్ల పాదాలలో ఉండే ప్రెజర్ పాయింట్లు ఉత్తేజితమై, శరీరంలోని ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా శరీరంలో సెరోటోనిన్ అండ్ డోపమైన్ వంటి “ఫీల్-గుడ్” రసాయనాలు పెరిగి, సహజంగానే మూడ్ మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇది జంటల మధ్య మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒకరికొకరు పాదాలకు మసాజ్ చేసుకోవడమనేది ప్రేమ, శ్రద్ధ, కంఫర్ట్, శారీరక సామీప్యతను(physical closeness) కలిగించే ప్రత్యేక క్షణాన్ని సృష్టిస్తుంది.
*సైకాలజిస్టుల ప్రకారం.. ఇలాంటి వల్ల ఏర్పడే సానుకూల భావోద్వేగ సంకేతాలు ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తాయి. ఒకరికొకరు మరింత సపోర్ట్‌గా ఉన్నట్టు భావించేలా చేస్తాయి. కాబట్టి ఫుట్ మసాజ్ కేవలం ఫిజికల్ రిలీఫ్(Physical relief) మాత్రమే కాదు. భాగస్వాముల మధ్య భావోద్వేగ సాన్నిహితత్వాన్ని (Emotional intimacy), ప్రేమాను బంధాన్ని బలోపేతం చేసే అద్భుతమైన మార్గం కూడాను.
*రిఫ్లెక్సాలజీ వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గి, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా దీనివల్ల మైగ్రేన్, మెడ నొప్పి, వెన్నునొప్పి, ఆర్థరైటిస్ నొప్పి, మెన్‌స్ట్రువల్ క్రాంప్స్ మొదలైనవి తగ్గుతాయి. ఒక మెటా-అనాలిసిస్ (Evidence-Based Complementary & Alternative Medicine, 2019) ప్రకారం రిఫ్లెక్సాలజీ సాంప్రదాయ నొప్పి నివారణ చికిత్సలతో సమానంగా పనిచేస్తుంది.
*పాదాలకు సున్నితమైన మసాజ్‌తో రక్తనాళాలు విస్తరించి, ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఇది డయాబెటిక్ న్యూరోపతి ఉన్నవారికి చాలా ఉపయోగకరం. అంతేకాకుండా నిద్ర నాణ్యత పెరుగుతుంది ఇన్సామ్నియా ఉన్నవారిలో 10-15 నిమిషాల ఫుట్ మసాజ్ క్రమం తప్పకుండా చేస్తే నిద్ర త్వరగా పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
*ఫుట్ మసాజ్ వల్ల లింఫ్ ప్రవాహం(Lymph flow) పెరిగి శరీరంలోని టాక్సిన్స్ త్వరగా బయటకు పోతాయి. తరచూ జలుబు, అలర్జీలు వచ్చే వారికి ఈ మసాజ్ మరింత మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకం, అజీర్తి, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (Irritable Bowel Syndrome) వంటి లక్షణాలు తగ్గుతాయి. పాదాల్లోని గ్యాస్ట్రో ఇంటెన్షనల్ రిఫ్లెక్స్(Gastrointestinal reflex in the foot) పాయింట్లు ఉత్తేజితమవడం తిన్న ఆహారంలో కదలిక(Peristalsis) మొదలై త్వరగా జీర్ణమవుతుంది.
*పీఎంఎస్ (PMS), మెనోపాజ్ లక్షణాలు, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. సెరోటోనిన్, డోపమైన్ హార్మోన్లు పెరుగుతాయి. హార్మోన్ల అసమతుల్యత తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. క్యాన్సర్, కీమోథెరపీ రోగులకు ఇదొక సహాయక చికిత్సలా పనిచేస్తుంది. వికారం, నొప్పి, అలసట, ఆందోళన తగ్గించడంలో రిఫ్లెక్సాలజీ సహాయక చికిత్సగా గుర్తించబడింది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

































