మొటిమల సమస్యకు.. కలబంద

మోముపై ఏర్పడిన మొటిమలు, మచ్చల్ని తగ్గించడంలోనూ కలబంద  ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో కలబందతో పాటు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను కలిపి ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి..


మూడు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జుకు రెండు టేబుల్‌స్పూన్ల పసుపు, రెండు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్ శెనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఇందులో మరికొంత రోజ్‌వాటర్ లేదంటే శెనగపిండి వేసుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల పాటు ఉంచి ఆపై గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమల తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.