సంక్షేమ పథకాలకు.. ఆ కార్డు ఉండాల్సిందే.. ప్రభుత్వం కీలక నిర్ణయం

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ రాష్ట్ర ప్రజలకు సైతం సూపర్ సిక్స్ హామీలను ఎన్నికలలో భాగంగా అమలు చేస్తామంటూ ప్రకటించారు. వాటిని అమలు చేయడానికి పలు రకాల ప్రణాళికలను సైతం రూపొందిస్తూ ఉన్నారు.
అయితే అంతకంటే ముందుగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటివరకు అమలు చేస్తున్న పథకాలకు లబ్ది పొందుతున్న వారందరికీ కూడా ఒక కొత్త కండిషన్ తీసుకురావడం జరిగిందట.. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టూడెంట్స్ కి ఫీజులు మెంబర్స్ నుంచి , సూపర్ సిక్స్ హామీల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎవరైతే అర్హులు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది.

అర్హులు అయ్యుండి కూడా రేషన్ కార్డు లేని వారికి సంక్రాంతిలోగా కొత్త కార్డులను సైతం మంజూరు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. అందుకు సంబంధించి టిడిపి పార్టీ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది.. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైనా సరే సంక్షేమ పథకాలు అందజేయాలి అంటే రేషన్ కార్డు కచ్చితంగా ముఖ్యమని.. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరొక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పించన్ తీసుకునే వారు , అలాగే ఇతర పథకాలు విద్యార్థుల ఫీజు రిమెంబర్స్ వంటి వాటిని పొందాలి అంటే కచ్చితంగా రేషన్ కార్డు అవసరమని తెలియజేసింది.

డిసెంబర్ రెండవ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర ప్రజలు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చని ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి కొత్త కార్డులు కూడా మంజూరు చేయబోతున్నామంటూ తెలియజేశారు.. అయితే గతంలో సీఎంలుగా పనిచేసిన వారందరూ వారి ఫోటోలతో రేషన్ కార్డులను ముద్రించి ఇచ్చారు.కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గుర్తింపుతో ఫోటోతో కార్డులో కొత్తగా చేరిన సభ్యులు లేకపోతే కొత్త వ్యక్తుల పేర్లను సైతం అప్డేట్ చేసుకోవచ్చని అందుకే కొత్త కార్డులను మంజూరు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు.