మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది, ఆడుదాం ఆంధ్రా పోటీల్లో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు

మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించిన పోటీల్లో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.


ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఆడుదాం ఆంధ్రా పేరుతో పోటీలు నిర్వహించింది. అయితే ప్రభుత్వం కేటాయించినవే కాకుండా జిల్లాలోని నిధులు కూడా వినియోగించినట్లు పలువురు సభ్యులు ఆరోపణలు చేశారు. ఇందులో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఏసీబీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా రోజా ఉన్నారు. ఈ క్రమంలో త్వరలో రోజా అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీలోనే కీలక నేతలు వరుసగా అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఆడుదాం ఆంధ్రాపై చర్చ

అటు ఆడుదాం ఆంధ్రాపై నిన్న ఏపీ అసెంబ్లీలో చర్చ కూడా నడిచింది. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ… 47 రోజుల్లో రూ.120 కోట్లు మంచినీళ్లలా ఖర్చు పెట్టారని కీలక కామెంట్స్ చేశారు. దీనిపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు గోల్ మాల్ అయ్యాయని కూటమి ఎమ్మెల్యేలు చర్చ సందర్భంగా ఆరోపించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.