Pope Francis : ఆందోళనకరంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం.. ఎక్కువ కాలం బతకను అంటూ సహాయకులతో చెప్పేసిన పోప్

క్యాధలిక్ చర్చి హెడ్ పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఊపిరితిత్తుల్లో న్యుమోనియా సమస్యతో పోప్ పోరాటం చేస్తున్నారు.


శ్వాసకోశ సంబంధ పాలీ మైక్రోబియల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఫిబ్రవరి 14వ తేదీన ఆసుపత్రిలో చేరారు పోప్. ఆయన రెండు ఊపిరితిత్తులకు న్యుమోనియా సోకినట్లు నిర్దారించారు డాక్టర్లు.

కాగా, న్యుమోనియాతో పోరాటంలో తాను గెలవలేనని తన సహాయకులతో పోప్ చెప్పినట్లు తెలుస్తోంది. న్యుమోనియా నుండి తానిక కోలుకోలేనని, ఎక్కువ కాలం బతకనని పోప్ తన సహాయకులతో చెప్పారట. ఈ మేరకు పోప్ వారసుడి ఎంపిక కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాట.

వామ్మో.. 59 ఏళ్ల వయసులో గుర్రంతో పోటీ.. మరోసారి వార్తల్లో రామ్ దేవ్ బాబా.. ఎంత రచ్చ రచ్చ జరిగిందంటే..

గత శుక్రవారం రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో పోప్ చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు డాక్టర్లు కృషి చేస్తూనే ఉన్నారు. పోప్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోప్ అనారోగ్యం నుండి కోలుకోవడం కష్టమే అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. పలు రకాల వైరస్ లు, బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో పోప్ తిరిగి కోలుకోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు డాక్టర్లు. న్యుమోనియాతో పాటు ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ తో పోప్ బాధపడుతున్నారని.. ఆయనకు యాంటీ బయోటిక్ చికిత్స కొనసాగించాలని డాక్టర్లు తెలిపారు.

2013లో కాథలిక్ చర్చి హెడ్ గా ఉన్న పోప్ ఫ్రాన్సిస్.. ప్రార్థనల సమయంలో బైబిల్ చదివేందుకు కూడా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇక 2021 లో హెర్నియా, పెద్ద పేగు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మోకాలి నొప్పి కారణంగా వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. 21 ఏళ్ల వయసులోనే ఓ వ్యాధి కారణంగా పోప్ దాదాపు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు ఆయన కుడి ఊపిరితిత్తులో కొంత భాగాన్ని కట్ చేసి వైద్యం చేసి బతికించారు.