Fraud- ICICI Bank Manager | భారత సంతతి అమెరికన్ మహిళ.. ఐసీఐసీఐ బ్యాంకులో మదుపు చేసిన రూ.13.5 కోట్ల సొమ్మును సంబంధిత బ్యాంక్ మేనేజర్ స్వాహా చేశాడు.
వాటిని మోసపూరిత కార్యక్రమాల్లో ఖర్చు చేశాడని శ్వేతా శర్మ బీబీసీకి చెప్పారు. అమెరికాలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.13.5 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశానని, వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని భావించినట్లు బీబీసీకి శ్వేత శర్మ తెలిపారు. తన భర్తతో కలిసి భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్ ద్వారా సదరు బ్యాంకు మేనేజర్’ను కలుసకున్నట్లు చెప్పారు.
అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల 5.5-6 శాతం వడ్డీ లభిస్తుందని బ్యాంకు మేనేజర్ నమ్మ బలికాడని శ్వేతా శర్మ చెప్పారు. కానీ, నాకు అతడు ‘ఫేక్ స్టేట్‌మెంట్లు, నా బ్యాంకు ఖాతా పేరిట ఫేక్ ఈ-మెయల్ ఐడీ నకిలీవి క్రియేట్ చేశాడని, బ్యాంకు నోటిపికేషన్లు ఏమీ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల కాలం (2019 సెప్టెంబర్-2023 డిసెంబర్) మధ్య తమ జీవితమంతా పొదుపు చేసిన రూ.13.5 కోట్లు పొదుపు చేస్తే మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.16 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
కానీ గత నెలలో మెరుగైన రిటర్న్స్ కోసం పెట్టిన పెట్టుబడుల్లో ఆ మనీ తుడిచి పెట్టుకుపోయిందని అదే బ్యాంకుశాఖ మరో అధికారి చెప్పారని శ్వేతా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు బ్యాంకు అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐసీఐసీఐ అధికార ప్రతినిధి చెప్పారు. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులకు ఫిర్యాదు చేశామని, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారి ప్రతినిధి చెప్పారు.