పర్యాటకులకు విమానాల్లో ప్రయాణం ఉచితం.. థాయ్‌లాండ్ అదిరిపోయే ఆఫర్

ర్యాటకులు ఎక్కువ ఇష్టపడే డెస్టినేషన్స్ లో థాయ్ లాండ్ ఒకటి. బ్యాంకాక్ మిల్క్ టీలు, ప్యాడ్ థైస్, మసాజ్‌ లతో ఎటు చూసినా సందడే కనిపిస్తుంది. అందమైన బీచ్ లు, అందులో అందాల కనువిందులు..ఆహా..


ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే, ప్రతి ఏటా లక్షలాది మంది విదేశీ టూరిస్టులు థాయ్ లాండ్ కు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వారిని మరింతగా ఆకట్టుకునేందుకు థాయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం 200,000 మంది అంతర్జాతీయ పర్యాటకులకు ఉచిత దేశీ ప్రయాణాన్ని అందించాలనుకుంటుంది. ఈ నిర్ణయంతో తమ దేశంలోని ఇతర డెస్టినేషన్స్ లో కూడా పర్యాటకుల తాకిడిని పెంచే ప్రయత్నం చేస్తోంది.

ఒక్కో టూరిస్టుకు రౌండ్ ట్రిప్ టికెట్స్ ఫ్రీ

ఉచిత దేశీయ విమాన ప్రయాణానికి సంబంధించి థాయ్ లాండ్ పర్యాటక మంత్రి సోరావాంగ్ థియంథాంగ్ కీలక విషయాలు వెల్లడించారు. “అంతర్జాతీయ విమాన టికెట్లు కొనండి.. థాయిలాండ్ లో ఉచిత విమానాల్లో ప్రయాణించండి” అని ఆయన పిలుపునిచ్చారు. తమ దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన నగరాలను, ప్రధాన పర్యాటక ప్రదేశాలను దర్శించడానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సోరావాంగ్ వెల్లడించారు. “తాజా నిర్ణయంలో భాగంగా ఒక వైపు ప్రయాణానికి 1,750 భాట్, రౌండ్ ట్రిప్‌లకు 3,500 భాట్ ధర గల దేశీయ విమాన టికెట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన నగరాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్య గమ్యస్థానాలను కవర్ చేస్తూ, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంమే లక్ష్యంగా కనీసం 200,000 మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడం కోసం ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం” అని సోరావాంగ్ వెల్లడించారు.

ఉచిత టికెట్లకు ఎవరు అర్హులంటే?

థాయిలాండ్ పర్యాటక రంగ వృద్ధికి దోహదపడేలా ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. థాయ్ ఎయిర్ ఏషియా, బ్యాంకాక్ ఎయిర్‌ వేస్, నోక్ ఎయిర్, థాయ్ ఎయిర్‌ వేస్ ఇంటర్నేషనల్ (థాయ్), థాయ్ లయన్ ఎయిర్, థాయ్ వియట్‌ జెట్ అనే ఆరు స్థానిక విమానయాన సంస్థలతో భాగస్వామ్యం ఏర్పర్చుకుంది. థాయ్, బ్యాంకాక్ ఎయిర్‌ వేస్ వెబ్ సైట్స్ నుంచి, లేదంటే థాయ్ ఎయిర్‌ ఏషియా, థాయ్ లయన్ ఎయిర్ నుంచి ఫ్లై-త్రూ/చెక్-త్రూ సేవల ద్వారా అదీ కాదంటే ఆన్ లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా థాయిలాండ్‌ కు వెళ్లే ప్రామాణిక విమాన టికెట్లను బుక్ చేసుకున్న విదేశీ పర్యాటకులు.. 20 కిలోల లగేజీతో దేశీయ విమానాల కోసం ఉచిత రౌండ్ ట్రిప్ టికెట్లను పొందే అవకాశం ఉంటుంది. పర్యాటకులు రెండు దేశీయ విమాన టికెట్లు లేదంటే వన్ వే టికెట్‌ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

విదేశీయులకు ఉచిత విమాన టికెట్ల కోసం థాయిలాండ్ టూరిజం అథారిటీకి 700 మిలియన్ బాట్ (1.2 బిలియన్లకు పైగా) బడ్జెట్ కేటాయింపు కోసం వచ్చే వారం క్యాబినెట్‌ కు ప్రతిపాదితను అందించనున్నారు. దానికి ఆమోదం లభించిన తర్వాత విదేశీయులకు ఉచిత దేశీయ విమాన టికెట్లు అందించనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.