మహిళలకు ఉచితంగానే కుట్టు మిషన్లు. నెలాఖరు వరకే ఛాన్స్, అర్హతలు ఇవే.. మహిళలకు భారీ శుభవార్త అని చెప్పవచ్చు. ప్రభుత్వం ఇంటి నుంచే డబ్బులు సంపాదించుకోవడానికి మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా అందించటానికి సిద్ధం అయింది.
ఈ మిషన్ కావాలంటే అప్లై చేసుకోవటానికి నెలాఖరు వరకే ఛాన్స్ ఉంది. కుట్టు మిషన్ ఫ్రీ గా రావాలి అంటే ఏ అర్హతలు ఉండాలి అనేది తెలుసుకుందాం. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ఇందిరమ్మ మహిళా పథకం కింద మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది.
కుట్టుపనిలో శిక్షణ పొందిన ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ మతాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తులను డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్య స్వీకరిస్తారు. TGMFC వెబ్‌సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ కాపీని, ఇతర అవసరమైన పత్రాలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి సమర్పించాలి. అప్పుడే మీరు ఈ స్కీమ్ కింద ఉచిత కుట్టు మిషన్ పొందటానికి అర్హత సాధిస్తారు.
ఈ పధకానికి 18 నుండి 55 సంవత్సరాల వయస్సు గల మహిళలు అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా నిరుద్యోగులు అయి ఉండాలి. లేదా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉండాలి.