నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో తమ సంస్థ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ల్యాండ్ సర్వేయర్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎన్టీఆర్ జిల్లా అధికారి పి.నరేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో భూమి కొలతలు, హైవే రోడ్డు లెవలింగ్, ఆటో లెవలింగ్, కెనాల్ సర్వే అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి సర్టిఫికెట్‌తో పాటుగా ప్రవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కూడా చూపిస్తామని చెప్పారు.
10వ తరగతి పాసై18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 11వ తేదీ లోగా విద్యాధరపురం కబేళా సెంటర్‌లో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ఆవరణలోని తమ కార్యాలయానికి పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబరుతో వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 98482 55009, 98667 95010 నెంబరులో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.