BSNL సంచలన నిర్ణయం! ఆ ప్రదేశాల్లో ఫ్రీ వైఫై

www.mannamweb.com


గవర్నమెంట్ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రజలకు ఉపయోగపడే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం అందరినీ ఆశ్చర్యపరిచి ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు తమ టారీఫ్‌ ధరలు పెంచిన తర్వాత వాటి కస్టమర్లు అంతా కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ బాట పట్టారు. ఎందుకంటే ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌లో మాత్రమే ఎలాంటి ధరలు పెంచలేదు. ధరలు పెంచకపోగా ఎన్నో చౌకైన ప్లాన్స్‌ను కూడా బిఎస్ఎన్ఎల్ తీసుకువస్తోంది. ఇప్పుడు తన హై స్పీడ్ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు పనులు స్పీడ్ అప్ చేస్తోంది.

ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాలాధరణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది కూడా ఈ సీజన్‌లో ఎన్నో లక్షలాది మంది అయ్యప్ప మాల వేసుకున్న వారు శబరిమలను దర్శించుకుంటారు. అయితే శబరిమల కొండ ప్రాంతం ఇంకా అటవీ ప్రాంతం కావడంతో అక్కడకు వచ్చే అయ్యప్ప భక్తులకు నెట్‌వర్క్‌ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా టెలికాం సేవలు అందవు. ఇంటర్నెట్ సరిగ్గా రాదు. అయితే ఈ సర్వీస్ లను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఈసారి బీఎస్‌ఎన్‌ఎల్ భారీ ప్లాన్‌ చేసింది. అందుకోసం శబరిమలలోని మొత్తం 48 ప్రదేశాల్లో బీఎస్ఎన్ఎల్ వై-ఫై కనెక్షన్లను రెఢీ చేసింది. BSNL ఇప్పటిదాకా శబరిమల, పంపా, నిలక్కల్ వంటి ఫేమస్ ప్లేస్ ల్లో పబ్లిక్ Wi-Fi సర్వీస్ లను ఇస్తుంది. తిరువనంతపురం దేవస్వం బోర్డ్ సహకారంతో నెట్‌వర్క్ ని బాగా డెవలప్ చేసింది. ఇది కాకుండా శబరిమల మార్గంలోకొన్ని 4G టవర్లను కూడా ఫిక్స్ చేసింది.

ఇంకా దీంతో పాటు పంపా, శబరిమల వద్ద యాత్రికులను రిసీవ్ చేసుకునేందుకు వారి అవసరాలను తీర్చేందుకు 24 అవర్స్ పనిచేసే కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను రెఢీ చేయనున్నట్లు సమాచారం. శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తులు శబరిమల, నిలక్కల్, పంపాలో BSNL Wi-Fi సర్వీస్ లను ఎలాంటి ప్రాబ్లెం లేకుండా పొందవచ్చు. ఈ సర్వీస్ కోసం మీరు ఫోన్‌లోని వై-ఫై ఆప్షన్‌ను ఆన్ చేయండి. దీని తర్వాత స్క్రీన్‌పై కనిపించే BSNL వైఫై నెట్‌వర్క్ సెలెక్ట్ ఎంచుకోండి. ఆ తర్వాత ఓపెన్‌ అయిన వెబ్ పేజీలో మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ని టైప్ చేసి, గెట్ పిన్‌పై క్లిక్ చేయండి. మీ ఫోన్‌లో 6-అంకెల పిన్ నంబర్‌ SMS వస్తుంది. ఆ నెంబర్ ని ఎంటర్ చేస్తే మీరు BSNL Wi-Fi సర్వీస్ ని పొందవచ్చు. ఈ విధంగా BSNL ప్రజలకు అనుగుణంగా ఫ్రీ వైఫై సర్వీస్ ని కూడా అందిస్తుంది.