ఏపీలోని అన్ని స్కూళ్లల్లో నేటి నుంచి: చివరి తేదీ ఇదే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..


తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల ఆధార్ కార్డు అప్ డేట్ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. నేడు ఈ ఆధార్ క్యాంపులు ఆరంభం కానున్నాయి. 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ఆధార్ కార్డు వివరాలను అప్ డేట్ చేసుకోని పిల్లల సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఇప్పటికీ 15.46 లక్షల మంది పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ కాలేదని అధికారులు తెలిపారు. వారందరూ కూడా తమ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇన్ యాక్టివ్ అవుతుంది. ఈ కారణంతోనే ప్రభుత్వం నేరుగా పాఠశాలల్లో ఆధార్ కార్డు అప్ డేట్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఫలితంగా పిల్లలు మరో చోటికి వెళ్లకుండా ఈ క్యాంపుల్లోనే బయోమెట్రిక్ వివరాలను అందజేసే వెసలుబాటు కలిగింది.

  • 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు తమ బయోమెట్రిక్‌, ఇతర వివరాలను ఈ క్యాంపుల ద్వారా అప్‌డేట్‌ చేసుకునే వీలుగా కల్పించింది ప్రభుత్వం.
  • ఆధార్ అప్ డేట్ ఉచితం. ఎటువంటి ఫీజు కూడా చెల్లించనక్కర్లేదు.
  • ఈ క్యాంపుల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ చేసుకోవచ్చు.
  • ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులో పేరులో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని సరిచేసుకోవచ్చు. దీనికోసం బర్త్ సర్టిఫికెట్ ను ప్రూఫ్ గా చూపించాల్సి ఉంటుంది. లేదా స్కూల్ రికార్డుల్లో ఎలా ఉందో అలా పేరును సరి చేసుకోవచ్చు.
  • అడ్రస్ లో ఏవైనా మార్పులు ఉంటే దాన్ని అప్ డేట్ చేసుకోవచ్చు. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది.
  • పుట్టిన తేదీని అప్ డేట్ చేసుకోవచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.