ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారులు గరిష్ట స్థాయికి చేరుకోబోతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర రోడ్లకు భారీ కేటాయింపులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల్లో 142 జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించింది.
ఏపీ అంతటా మొత్తం రూ. 6,038.38 కోట్లు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖలు సంయుక్తంగా ఈ వాస్తవాలను వెల్లడించాయి. ఈ మేరకు ఏఏ హైవేకు ఎంత కేటాయింపులు జరిగాయి.. ఎన్ని కోట్లు కేటాయించారో బడ్జెట్ అంశం గణాంకాలలో వెల్లడైంది.
కేటాయింపులు జరిగాయి
జాతీయ రహదారిలోని రాయచోటి – వేములపల్లి విభాగం విస్తరణకు రూ. 140 కోట్లు
కడప – జమ్మలమడుగు NH- 167K విస్తరణకు రూ. 143 కోట్లు.
NH-216పై నరసాపురం బైపాస్ నిర్మాణానికి రూ. 141 కోట్లు.
వేంపల్లి – చాగలమర్రి NH-440 విస్తరణకు రూ.205 కోట్లు.
పామర్రు – ఆకివీడు NH-165 ఆధునీకరణకు రూ. 110 కోట్లు
ముదిరెడ్డిపల్లి నుండి కడప మీదుగా నెల్లూరు సరిహద్దు వరకు NH-167 నిర్మాణానికి రూ. 110 కోట్లు.
తాడిపత్రి – ముద్దనూరు NH-67 విస్తరణకు రూ. 101 కోట్లు.
ముద్దనూరు – బి. కొత్తపల్లి సెక్షన్ విస్తరణకు రూ. 150 కోట్లు.
బి. కొత్తపల్లి జంక్షన్ – గోరంట్ల NH-716JR విస్తరణకు రూ. 200 కోట్లు.
సోమయాజులపల్లి – డోన్ NH-340 లోపల రోడ్డు ఆధునీకరణకు రూ. 190 కోట్లు.
పుట్టపర్తి – కోడూరు సెక్షన్‌లోని NH-342 ఆధునీకరణకు రూ. 200 కోట్లు.
నంద్యాల – కడప NH-167K ఆధునీకరణకు రూ. 175 కోట్లు.
సంగమేశ్వరం – నల్లకలువల మధ్య రోడ్డు విస్తరణకు రూ. 200 కోట్లు.
గోరంట్ల – హిందూపురం NH-716G విస్తరణకు రూ. 182 కోట్లు.
చిలకలూరిపేట – నకరికల్లు NH-167A సెక్షన్ విస్తరణకు రూ. 151 కోట్లు.
కొండమోడు – పేరేచర్ల సెక్షన్ విస్తరణకు రూ. 196 కోట్లు.
పోర్ట్ – చిలకలూరిపేట సెక్షన్ విస్తరణకు రూ. 250 కోట్లు.
పెందుర్తి – బౌదర NH-516B సెక్షన్ ఆధునీకరణకు రూ. 181 కోట్లు.
పాడేరు బైపాస్ నిర్మాణానికి రూ. 120 కోట్లు.
NH-365 విస్తరణకు రూ. 204 కోట్లు.
దేవులపల్లి – మల్లపాలెం NH-565 ఆధునీకరణకు రూ. 210 కోట్లు.
లంబసింగి – పాడేరు NH-5167 సెక్షన్ ఆధునీకరణకు రూ. 122 కోట్లు.
































