ఏపీలో కాబోయే ధనిక జిల్లా ఏదో తెలుసా

www.mannamweb.com


ఏపీకి రాజధాని అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ.. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ అనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా అద్భుతమైన ప్రాంతం అని ఒకరంటే..

విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది, కాస్త బూస్ట్ ఇస్తే చాలు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లా మారుతుందని మరొకరు అంటుంటారు.

ఇక పరిపాలనా సౌలభ్యం కోసం అంటూ 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా చేశారు. ఇప్పుడు పాలన మరింత సులువైందనే మాటలు వినిపిస్తున్నాయి. జిల్లా రాజధాని దగ్గరైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిని ప్రతిబింబించే జీడీపీ అంచనాల తాజా జాబితా విడుదలైంది.

అవును… 2028 – 29 సంవత్సరాని కల్లా రాష్ట్రంలో వివిధ జిల్లాల పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఇందులో అంచనా వేశారు. ఇందులో భాగంగా… విశాఖపట్నం జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలు ఒక్కో ర్యాంగ్ తగ్గి.. మూడు, నాలుగు స్థానాల్లో నిలవబోతున్నాని అంటున్నారు.

ఇదే క్రమంలో… నాలుగో స్థానంలో ఉన్న తిరుపతి జిల్లా… ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరబోతోందని అంటున్నారు. ఇక ఐదో స్థానంలో ఏలూరు.. ఆరో స్థానంలో అనంతపురం.. ఏడు నెల్లూరు జిల్లాలు ఉండబోతున్నాయని చెబుతున్నారు. ఇక అమరావతి రాజధాని ఉండే గుంటూరు ఎనిమిదో స్థానంలో నిలవబోతుందని అంటున్నారు.

ఈ విధంగా ర్యాంకుల వారిగా జిల్లల వివరాలు ఇప్పుడు చూద్దామ్..!

1. విశాఖపట్నం

2. తిరుపతి

3. ఎన్టీఆర్

4. కృష్ణా

5. ఏలూరు

6. అనంతపురం

7. నెల్లూరు

8. గుంటూరు

9. ప్రకాశం

10. వైఎస్సార్

11. తూర్పుగోదావరి

12. కాకినాడ

13. పశ్చిమ గోదావరి

14. కర్నూలు

15. అనకాపల్లి

16. సత్యసాయి

17. పల్నాడు

18. చిత్తురు

19. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ

20. శ్రీకాకుళం

21. బాపట్ల

22. నంద్యాల

23. అన్నమయ్య

24. విజయనగరం

25. పార్వతీపురం

26. అల్లూరి సీతారామరాజు