వైఎస్ జగన్‌కు కోలేకోలేని దెబ్బ: వైసీపీకి గంజి చిరంజీవి గుడ్ బై..జనసేన పార్టీలోకి జంప్

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి..

ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరికొందరు నేతలు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆప్కాబ్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి వైసీపీకి రాజీనామా చేశారు. గంజి చిరంజీవి సతీమణి రాధ సైతం జనసేన పార్టీలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి-రాధ దంపతులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.

జనసేనలో చేరిన గంజి చిరంజీవి దంపతులు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరికొందరు నేతలు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. మంగళగిరిలో వైసీపీకి కీలక నేతగా ఉన్న ఆప్కో మాజీ చైర్మన్‌,వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడు అయిన గంజి చిరంజీవి సతీ సమేతంగా జనసేన పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గంజి చిరంజీవి దంపతుల మెడలో జనసేన పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే వీరికి పార్టీ పదవుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా గంజి
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి టీడీపీలో కీలకంగా ఉండేవారు. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప మెజార్టీతో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం టీడీపీ హయాంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలో అప్పటి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ చిరంజీవి సైలెంట్ అయిపోయారు. టికెట్ ఇవ్వకపోయినప్పటికీ పార్టీలోనే కొనసాగారు. అలాగే నారా లోకేశ్‌కు అనుచరుడిగానే వ్యవహరించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో జంప్ అయిపోయారు. వైసీపీలో ఆప్కో చైర్మన్‌గా పనిచేశారు. అలాగే వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేనపార్టీలో చేరారు.