Garlic:వెల్లుల్లి చేసే మాయ తెలిస్తే. షాక్ అవ్వాల్సిందే
Garlic benefits In Telugu :వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికి తెలిసిన విషయమే. వెల్లుల్లిని ప్రతి రోజు ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
వెల్లుల్లి వాసన ఘాటుగా ఉంటుందని, తింటే వాసన వస్తుందని చాలా మంది వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ… ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఇది నివారస్తుంది. దాని ఉపయోగాల్లో కొన్ని…
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే యాంటాక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని కొవ్వులను తగ్గించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది. ఫలితంగా మనలో గుండెపోటును నివారిస్తుంది.
మనం తినే ఆహారంలోని కలుషిత, మలిన పదార్థాల వల్ల మన శరీరంలో వయసు పెరగడాన్ని ప్రేరేపించే ఫ్రీరాడికల్స్ పెరుగుతాయి. ఇవి వయసు పెంచడంతో పాటు కొందరిలో ఒక్కోసారి క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే యాంటాక్సిడెంట్ ఫ్రీ-రాడికల్స్‌ను వెంటనే హరిస్తుంది. ఫలితంగా మనలో అది వయసు పెరగడాన్ని, క్యాన్సర్‌ను నిరోధిస్తుంది.
వెల్లుల్లి తినడం వల్ల మన రక్తనాళాల్లోని సాగే గుణం పదిలంగా ఉంటుంది. వెల్లుల్లి తినని వారిలో కంటే దాన్ని క్రమం తప్పకుండా తినే వారిలో రక్తనాళాలు సాగే గుణం 72% అధికంగా ఉంటుంది.
శరీరంపై గీసుకుపోయిన చోట… ఏ మందూ లభ్యం కానప్పుడు వెల్లుల్లిని కాస్తంత రుద్దితే అక్కడి బ్యాక్టీరియాను అది నిరోధిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.