కొత్త ఏడాది కానుకగా.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

www.mannamweb.com


కొత్త ఏడాది కానుకగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ప్రతి 19 కేజీల ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై14.5 రూపాయలు తగ్గినట్లు గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలతో 2025 జనవరి 1న సిలిండర్ ధర రూ.1804కు చేరుకుంది. దేశ రాజధాని, ఢిల్లీ, ముంబాయి తదితర మెట్రో సిటీలలో తగ్గిన ధరలు 1 జనవరి 2025 నుంచి అమలులోకి వస్తాయి.

2024 డిసెంబర్ లో ధరలు పెంచనున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన ధరల కారణంగా భారత్ లో 1 జనవరి 2025 నుంచి గ్యాస్ ధరలను తగ్గించాయి కంపెనీలు.

ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరల సవరింపు ఉంటుందని గతంలో ప్రకటించిన కంపెనీలు.. ఆగస్టు 2024 నుంచి ధరలు పెంచుతూ వస్తున్నాయి. జనవరి 2025 నుంచి ధరలు పెరగాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ ఆయిల్ ధరలు తగ్గడం వలన ప్రస్తుతం ధరలు తగ్గడం గమనార్హం.

కొత్తగా మారిన 19-kg LPG ధరలు:

ఢిల్లీ రూ. 1,804
ముంబాయి రూ.Rs 1756
చెన్నై రూ. Rs 1966
కోల్ కతా రూ.- Rs 1911