కేంద్ర ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా బీమా కార్యకలాపాల నిర్వహణలో అగ్రస్థానంలో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 110 ఖాళీలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో ఒకటైన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 110 ఖాళీలను భర్తీ చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 క్యాడర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. 2025 జనవరి 5వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు వారం ముందు హాల్ టిక్కెట్లను విడుదల చేస్తారు.
మొత్తం ఉద్యోగాల్లో జనరల్ క్యాటగిరీలో 18 పోస్టులు, లీగల్ విభాగంలో 9, హెచ్‌ఆర్‌లో 6,ఇంజనీరింగ్‌లో 5, ఐటీలో 22, ఇన్సూరెన్స్‌లో 20, అక్యుటరీలో 10, మెడికల్‌లో 2, ఫైనాన్స్‌లో 18 మొత్తం 110 ఉద్యోగాలు భర్తీ చేస్తారు.పోస్టుల వారీగా విద్యార్హతలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్‌లలో పరీక్ష ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షల సిలబస్ వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
మొత్తం పోస్టుల్లో జనరల్ క్యాటగిరీలో 43, ఎస్సీ విభాగంలో 15, ఎస్టీ విభాగంలో 10, ఓబీసీ విభాగంలో 34, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 6 ఖాళీలు భర్తీ చేస్తారు. మెడికల్ విభాగంలో ఎస్టీ విభాగంలో 1, ఈడబ్ల్యూఎస్ కోటాలో 1 భర్తీ చేస్తారు.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారికి 21ఏళ్ల వయసు కలిగి ఉండాలి. గరిష్టంగా 30ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఇస్తారు. ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు 10ఏళ్లు సడలింపు ఇస్తారు. వితంతువులు, విడాకులు పొందిన వారికి 9ఏళ్ల సడలింపు ఇస్తారు.