Amazon GIF Sale 2025 స్టార్ట్ కావడానికి ఇంకా 12 రోజులు ఉండగా, అమెజాన్ అప్ కమింగ్ సేల్ అర్లీ డీల్స్ అనౌన్స్ చేసింది. అంటే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించనున్న బిగ్ డీల్స్ ముందే రివీల్ చేసింది. ఇందులో భాగంగా భారీ Smart Tv డీల్స్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి అందించనున్న డీల్స్ లో బెస్ట్ డీల్స్ ను టీజర్ పేజీ ద్వారా లిస్ట్ చేసింది. కేవలం రూ. 21,999 రూపాయల ప్రారంభ ధర నుంచే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి, అని అమెజాన్ ఈ పేజీ ద్వారా టీజింగ్ చేస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 నుంచి స్మార్ట్ టీవీ లపై భారీ ఆఫర్ లను అందించే అవకాశం ఉంటుందని అమెజాన్ స్పష్టంగా తెలియ చేసింది. భారత ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న GST 2.0 రీఫార్మ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, సేల్ స్టార్ట్ అయితే కానీ ఇందులో నిజా నిజాలు తెలిసే అవకాశం తెలియవు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 బెస్ట్ డీల్స్ ను అర్లీ డీల్స్ పేరుతో అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఇందులో VW బ్రాండ్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ గురించి టీజింగ్ చేస్తోంది. ఈ టీవీ అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 21,999 ధరలో అందుకోవచ్చని ఈ పేజీ లో తెలిపింది. అయితే, ఈ టీవీ మోడల్ లేదా వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు. టీజర్ ఇమేజ్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ బ్రాండ్ నేమ్ కనిపించింది.
ఇది కాకుండా 75 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ కూడా వెల్లడించింది. కేవలం రూ. 49,999 రూపాయల ప్రారంభ ధర నుంచి బిగ్ 75 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి, అని కూడా కూడా అమెజాన్ టీజింగ్ చేసింది. అయితే, ఏ బ్రాండ్ స్మార్ట్ టీవీలు ఈ ఆఫర్ ధరలో అందిస్తుందో ఇంకా ప్రకటించలేదు.
అవును, సోనీ మరియు శామ్సంగ్ స్మార్ట్ టీవీ డీల్స్ కూడా ఈ టీజర్ పేజీ నుంచి టీజింగ్ చేసింది. సోనీ బ్రావియా 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మరియు శామ్సంగ్ లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ సిరీస్ పై కూడా బిగ్ డీల్స్ ఆఫర్ చేయనున్నట్లు అమెజాన్ టీజర్ పేజి లో ప్రకటించింది.
మొత్తానికి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 నుంచి గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందుకునే అవకాశం ఉండవచ్చు అని అర్థం అవుతోంది.
































