ఆన్‌లైన్‌లో ఈజీగా.. హై సెక్యూరిటీ ప్లేట్‌ ఇలా తీసుకోండి

ఆన్‌లైన్‌లో ఈజీగా బుక్‌ చేసుకోవచ్చు
ఇక నుంచి 2019 ఏప్రిల్‌ 1కి ముందు తయారైన వాహనాలకూ తప్పనిసరి
ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు గడువు
హెచ్‌ఎస్‌ఆర్పీ లేకుండా రోడ్లపైకి వస్తే చర్యలే: రవాణాశాఖ


రాష్ట్రంలో ఉన్న కొత్త, పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌(హెచ్‌ఎస్‌ఆర్పీ) ఉండాలనే నిబంధనతో కొందరు వాహనాదారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు 2019 ఏప్రిల్‌ 1 తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ నిబంధన అమలులో ఉండగా, ఇక నుంచి అంతకు ముందు తయారైన వాహనాలకూ ఏర్పాటుచేసుకోవాలని ఆదేశిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు గడువు సైతం ఇచ్చింది.

ఫిట్‌నెస్‌ టెస్టు సహా.. వాహనాలకు సంబంధించి రవాణాశాఖ ద్వారా ఏ సేవ పొందాలన్నా ఈ నంబర్‌ ప్లేట్‌ ఉంటేనే సాధ్యమని, ఆ నంబర్‌ ప్లేటు లేని వాహనాలకు రవాణాశాఖలో ఎలాంటి సేవలు అందబోవని, ఇన్సూరెన్స్‌ చేయడం కూడా కుదరదని తేల్చి చెప్పింది. ఇక ఆ ప్లేట్‌ లేకుండా వాహనాలు రోడ్డు ఎక్కితే జరిమానాతోపాటు బండ్లను సీజ్‌ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో హెచ్‌ఎస్‌ఆర్పీ ఎలా తీసుకోవాలో తెలియక కొందరు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వాహనదారులు www.siam.in వెబ్‌సైట్‌లో ఈ హెచ్‌ఆర్పీని సులువుగా పొందవచ్చు. మీరు ఎంచుకున్న తేదీలో మీకు నచ్చిన డీలర్‌ దగ్గర సెప్టెంబర్‌ 30లోపు ఫిట్టింగ్‌ చేయించుకోవచ్చు.

హెచ్‌ఎస్‌ఆర్పీ కోసం ఇలా చేయాలి..

హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్పీ) కావాలనుకున్న వాళ్లు ముందుగా https://www.siam.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
పైన కనిపించే ‘బుక్‌ హెచ్‌ఎస్‌ఆర్పీ’పైన క్లిక్‌ చేయాలి.
ఆ తర్వాత ప్రత్యేకంగా విండో ఓపెన్‌ అవుతుంది.
అందులో ఫుల్‌నేమ్‌, వాహన నంబర్‌, ఈ మెయిల్‌, మొబైల్‌ నంబర్‌, రాష్ట్రం, జిల్లా వంటివి ఎంటర్‌ చేసి నిబంధనలపై క్లిక్‌ చేసి సబ్మిట్‌ చేయాలి.
ఆ తర్వాత మీ వాహనం టైప్‌(టూ వీలర్‌, త్రీ వీలర్‌, ఫోర్‌ వీలర్‌, బస్‌, ట్రక్‌, కమర్షియల్‌ వాహనం) సెలెక్ట్‌ చేసుకోవాలి.
ఆ తర్వాత కింద కనిపించే మీ వాహన కంపెనీని సెలెక్ట్‌ చేసుకోవాలి.
ఇక్కడ ప్రత్యేకంగా మరో విండో ఓపెన్‌ అవుతుంది. అందులో మీకు కావల్సిన ‘హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ విత్‌ కలర్‌ స్టిక్కర్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
ఇందులో స్టెప్‌-1 బుకింగ్‌ డిటెయిల్స్‌, స్టెప్‌-2 ఫిట్‌మెంట్‌ లొకేషన్‌, స్టెప్‌-3 అపాయింట్‌మెంట్‌ స్లాట్‌, స్టెప్‌-4 బుకింగ్‌ సమ్మరీ, స్టెప్‌-5 వెరిఫై డిటెయిల్స్‌ అండ్‌ పే, స్టెప్‌-6 డౌన్‌లోడ్‌ రిసిప్ట్‌ వరకు అన్నింటినీ క్షుణ్ణంగా పూర్తిచేయాలి.
స్టెప్‌-1లో వాహన నంబర్‌, ఫ్రేమ్‌/చాసిస్‌ నంబర్‌లోని చివరి ఐదు నంబర్లు, ఇంజిన్‌ నంబర్‌లోని చివరి ఐదు నంబర్లు ఎంటర్‌ చేసి క్యాప్చా నంబర్‌ ఎంటర్‌ చేయాలి.
ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న డేట్‌, టైమ్‌ను ఎంపిక చేసుకోవాలి.
ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న ఫిట్‌మెంట్‌ లొకేషన్‌లో సర్వీస్‌ సెంటర్‌ను ఎంచుకోవాలి. అక్కడే మీకు వాహన ప్లేట్‌కు ఖర్చు ఎంత అవుతుందో కనిపిస్తుంది.
దానిని ఎంచుకుంటే బుకింగ్‌ సమ్మరీ కనిపిస్తుంది. దానిని వెరిఫై చేసుకొని పేమెంట్‌కు వెళ్లొచ్చు. అక్కడ క్రెడిట్‌, డెబిట్‌, యూపీఐ, నెట్‌ బ్యాకింగ్‌ ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు.
డబ్బులు చెల్లించిన తర్వాత వివరాలు చెక్‌ చేసుకొని అప్లికేషన్‌ ప్రింట్‌ తీసుకోవచ్చు. సంబంధిత సర్వీస్‌ సెంటర్‌ వివరాలు, ఫోన్‌ నంబర్‌ ఉంటాయి.
అపాయింట్‌మెంట్‌ రోజు ఆర్సీ కాపీని వెంట తీసుకెళ్లాలి.
ఆ స్లిప్‌ వ్యాలిడిటీ 28 రోజుల వరకు మాత్రమే ఉంటుంది.
ఫిట్‌మెంట్‌కు ఎక్స్‌ట్రా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఏవైనా అభ్యంతరాలుంటే 8929722201 నంబర్‌, మెయిల్‌ online@bookmyhsrp.comలో సంప్రదించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.