ఘట్టమనేని వంశం నుంచి మరో హీరో దూసుకొస్తున్నాడు. దివంగత కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. అతని డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు ఇవాళ రిలీజ్ చేశాడు. మాస్ లుక్ లో జయ కృష్ణ అదరగొట్టాడు.
ఘట్టమనేని కుటుంబం నుంచి కొత్త తరం హీరో వచ్చేస్తున్నాడు. మహేష్ బాబు అన్న దివంగత రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఘట్టమనేని జయ కృష్ణ డెబ్యూ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ఇవాళ హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు ఎక్స్ లో ఈ పోస్టర్ పంచుకున్నాడు.
మాస్ లుక్ లో జయ కృష్ణ
మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అతని ఫస్ట్ మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే పేరు పెట్టారు. దీనికి అజయ్ భూపతి డైరెక్టర్. ఈ సినిమా నుంచి జయ కృష్ణ ఫస్ట్ లుక్ ను శనివారం (జనవరి 10) సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. జయకృష్ణ మాస్ లుక్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి.
ఇంట్రెస్టింగ్ బిగినింగ్
శ్రీనివాస మంగాపురం నుంచి జయ కృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకుంటూ మూవీ టీమ్ కు మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘‘శ్రీనివాస మంగాపురం ఫస్ట్ లుక్ రివీల్ చేయడం సంతోషంగా ఉంది. డెబ్యూట్ లో జయ కృష్ణకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. బలమైన టీమ్. ఇంట్రెస్టింగ్ బిగినింగ్.. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్’’ అని మహేష్ బాబు ఎక్స్ లో పోస్టు చేశాడు.
లవ్ అండ్ మిస్టరీ
శ్రీనివాస మంగాపురం మూవీ లవ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్లు తెలిసింది. ఇప్పటికే మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇందులో జయ కృష్ణ సరసన బాలీవుడ్ రషా తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె సీనియర్ నటి రవీనా టండన్ కూతురు.
‘ఆర్ ఎక్స్ 100’, ‘మహా సముద్రం’, ‘మంగళవారం’ సినిమాలతో పాపులర్ అయిన అజయ్ భూపతి ఈ శ్రీనివాస్ మంగాపురం మూవీకి డైరెక్టర్. చందమామ కథలు బ్యానర్ పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని అశ్వనీదత్ సమర్పిస్తున్నారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో
శ్రీనివాస మంగాపురం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు టాక్. మూవీ టైటిల్ లోనే ఇది స్పష్టమవుతోంది. ఇక జయ కృష్ణ లుక్ కూడా మూవీపై హైప్ పెంచేలా ఉంది. బైక్ పై చేతిలో గన్ తో ఎయిమ్ చేస్తూ జయ కృష్ణ కనిపించాడు. అతని కళ్లలో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. మొత్తానికి ఘట్టమనేని వంశం నుంచి మరో వారసుడి గ్రాండ్ ఎంట్రీకి సరైన సినిమా సెట్ అయిందనే టాక్ వినిపిస్తోంది.


































