చేనేత వస్త్రంపై మంత్రి లోకేశ్‌కు అభిమాని వినూత్న కానుక

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, అతని కుమారుడు కార్తికేయ బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు.


గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, అతని కుమారుడు కార్తికేయ బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాంశ్‌ చిత్రాలతో నేసిన చేనేత వస్త్రాన్ని మంత్రికి బహుకరించారు. అభిమాని ఇచ్చిన ప్రత్యేక బహుమతి చూసి లోకేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు జంజనం మల్లేశ్వరరావు ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. వారికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తన టీమ్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.