మొంథా తుపాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
‘జిల్లాలకు ఇన్‌ఛార్జిలను వేయాలి. అవసరం అయితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను అందించాలి. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, 100 మిల్లీ మీటర్ల మేర వర్షాలు పడతాయి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ తుపాను ప్రభావం ఉండనుంది. కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
”అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలి. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించండి. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
































