Glass for Janasena : బిగ్ రిలీఫ్.. గాజుగ్లాసు జనసేనకే

xr:d:DAGBV-H06Zc:10,j:4238310963308968729,t:24040313

Big Relief for Janasena : జనసేన పార్టీకి ఏపీ హై కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ జనసేనకే కేటాయించింది. జనసేనకు గాజుగ్లాస్ గుర్తును కేటాయించవద్దని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) హైకోర్టులో పిటిషన్ వేసింది.


ఇటీవలే ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హై కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. నేడు జనసేనకు అనుకూలంగా తీర్పునివ్వడంతో.. జనసేనులంతా ఊపిరి పీల్చుకున్నారు. జనసేనకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.