‘గ్లోబల్‌ ట్రాటర్‌’ కొత్త అప్‌డేట్స్‌

హేశ్‌ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘ఎస్‌ఎస్‌ఎంబి29’ వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ ఈ రోజు(శనివారం) రిలీజ్‌ చేయబోతున్నారు.


ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్‌లో భారీ ఈవెంట్‌ నిర్వచించబోతున్నారు. అందుకు సంబంధించిన పాస్‌లు కూడా ఫ్యాన్స్‌కు మేకర్స్‌ అందజేశారు. ఇక సినిమా విశేషాలకి వస్తే.. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసారని వార్తలు వస్తున్నాయి.

ఈరోజు జరగబోయే ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. టైటిల్‌ పోస్టర్‌ తో పాటు గ్లిమ్స్‌ కూడా రిలీజ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై కూడా అప్‌డేట్‌ వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమాను 2027 మార్చి 25న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌ జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.