ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను నియమించింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీనిపై కీలక ప్రకటన విడుదల చేసింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషన్ పేరును ఖరారు చేయడానికి సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ప్రధాన మంత్రి మోదీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా CECని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ సౌత్ బ్లాక్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమై, జ్ఞానేష్ కుమార్ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ పేరును ఆమోదించారు. ప్రస్తుత CEC పదవీ విరమణ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు.