నాన్ వెజ్ లో చాలా రకాలు ఉన్నప్పటికీ రెండు మాత్రం చాలా చాలా ఫేమస్. అందులో ఒకటి చికెన్, రెండోది మటన్. మటన్ కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటుంది కాబట్టి చాలామందికి దీన్ని తినాలని ఉన్నా తినలేకపోతుంటారు.
అయితే చికెన్ తో పోల్చితే మటన్ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతుంటారు. మేక మాంసం, గొర్రె మాంసంను రెండింటీని మటన్ అంటారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే ఏ పంక్షన్ వచ్చినా మటన్ ఉండి తీరాల్సిందే. మరికొందరికి అయితే ప్రతిరోజూ మటన్ కావాల్సిందే..మటన్ లేనిదే ముద్ద దిగదు మాకు అని సరదాగా చెప్తుంటారు.
మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ రోజూ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, బరువు పెరిగే అవకాశం ఉంది,మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మటన్ మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కొందరికి మాత్రం అసలు తినకపోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఎవరు మేక మాంసం తినకూడదు? కారణం ఏంటీ? ఇక్కడ చూడండి.
వీరికి మటన్ చాలా డేంజర్
పిల్లలకు డేంజర్
పిల్లలకు అధిక మొత్తంలో మటన్ పెట్టకూడదంట. ఎందుకంటే పిల్లలు కాలేయాలు, కిడ్నీలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి ఎక్కువ ప్రోటీన్‌ను మెయింటెయిన్ చేయలేవు. మటన్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబ్టటి పిల్లలు ఎక్కువ మటన్ తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వేడి విపరీతంగా
చాలామంది తరచుగా తమకు ఒంట్లో వేడిగా ఉందని అంటుంటారు. హై ఫీవర్, ఫైల్స్, పంటి నొప్పి,కఫంతో బాధపడేవాళ్లకి కూడా శరీరంలో వేడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వారు మేక మాంసం తినకపోవడం బెటర్. మటన్ ఎక్కువ తింటే ఇది మీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి మేక మాంసంకి దూరంగా ఉండమే మంచిదని నిపుణులు చెబుతుంటారు.
ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఉంటే
కాలేయ సంబంధిత వ్యాధులు మెయిన్ గా ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నవాళ్లు మేక మాంసం అస్సలు తినకూడదంట. ఎందుకంటే మేక మాంసంలో ఉండే అధిక ప్రోటీన్ కాలేయంపై ఒత్తిడి తెస్తుందట. కాబట్టి కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు దీనిని తినకపోవడమే ఉత్తమం.