వ్యాపారం అంటే ఎదో కొత్తదనం ఉంటేనే సక్సెస్ కాగలము, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో వ్యాపారం చేయలేము…ఇవన్నీ ఓడిపోయేవాడి మాటలు. మీరు జీవితాన్ని గెలవాలనుకుంటే, వ్యాపారాన్ని చెయ్యాలనుకుంటే మన చుట్టూ అనేక అవకాశాలుంటాయి.
120 కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద మార్కెట్ మనది. ఇక్కడ ఏమి అమ్మినా డబ్బే. అతి తక్కువ పెట్టుబడితో, రిస్క్ లేకుండా ఎన్నో వ్యాపారాలు చెయ్యవచ్చు. అలాంటి ఒక వ్యాపారం గురించి ఈ రోజు మీకు చెప్తాము. తక్కువ పెట్టుబడితో చేసే వైట్ గోల్డ్ బిజినెస్ ఇది. ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే…
పూజ, పెళ్లి, చట్నీ, స్వీట్ ఇలా ఏదైనా ఖచ్చితం గా కొబ్బరికాయ ఉండాల్సిందే. ఈ రోజు మార్కెట్ లో ఒక విడి కొబ్బరికాయ పెద్ద సైజుది కొనాలంటే 30 రూపాయాల పైమాటే. మరి ఈ కొబ్బరి కాయకు రైతుకు అందేది ఎంతో తెలుసా. సగటున 9 రూపాయలు. అంటే 9 రూపాయలకు కొన్న కొబ్బరికాయ మనకు చేరేవరకు 30 రూపాయలు అవుతుంది. అంటే దీంట్లో ఎంత లాభం ఉందో తెలుస్తుంది. ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్. అయితే అందరూ అనుకుంటారు ఈ వ్యాపారం చెయ్యాలంటే మనకి ఏమి తెలుసు. కొబ్బరికాయలు కొని అమ్మాలంటే మనకి అవుతుందా అని. అది నిజం కాదు. ఇది కోనసీమవాళ్లు మాత్రమే అమ్మేది ఏమి కాదు. ఎవరైనా చెయ్యొచ్చు. పైగా పెట్టుబడి అతి తక్కువ పెట్టుబడి. మీరు వారానికి ఒక 8 వేలు కొబ్బరికాయ అమ్మాలని టార్గెట్ పెట్టుకుంటే మీ మొత్తం పెట్టుబడి ఒక లక్ష ఉంటే సరిపోతుంది. సరే కొబ్బరికాయ అమ్మాలని డిసైడ్ అయ్యారు. సరుకు ఎక్కడ దొరుకుతుంది. ఎలా తెప్పించాలి. ఎక్కడ అమ్మాలి అంటారా. స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఇదిగో
కొబ్బరికాయ ఎక్కడ నుండి కొనాలి:
మనకు ఆంద్రప్రదేశ్ లో కొబ్బరి ఎక్కువగా పండే ప్రాంతం కోనసీమ. కొబ్బరి వ్యాపారం కోసం మీరు కోనసీమకు వెళ్లి అక్కడ హోల్ సేల్ వ్యాపారాల నుండి కొనడానికి ప్రయత్నం చెయ్యవద్దు. అందులో మీకు మిగిలేది ఏమి ఉండదు. మీ టార్గెట్ చిన్న వ్యాపారులు. వీరు కోనసీమలో ప్రతి చిన్న వూర్లో ఉంటారు. మీరు అమలాపురం పరిసరాల్లో చిన్న గ్రామాలయిన పాశర్లపూడి, ఈదరాడ లాంటి చిన్న గ్రామాల్లోకి వెళితే అక్కడ రైతు నుండి కొని హోల్ సేల్ మార్కెట్ కు అమ్మే వ్యాపారులుంటారు. వారి దగ్గర ఈ కొబ్బరికాయలు తక్కువ ధరకు వస్తాయి. వారు మీకు రైతు నుండి కొన్న కొబ్బరికాయను గ్రేడింగ్ చేసి పీచు ఒలిచి మీకు కావాల్సిన ప్రాంతానికి ఎక్స్ పోర్ట్ చెయ్యగలరు. ఇప్పుడు రైతు నుండి 9 రూపాయలకు కొన్న కొబ్బరికాయను పీచు తియ్యటానికి ఒక కాయకు రూపాయి ఖర్చు అవుతుంది. ఇంకా దానికి ట్రాన్స్ పోర్ట్ అదనం. మీరు కొట్టు పెట్టే ప్రాంతాన్నిబట్టి ఇది పెరుగుతుంది. మీరు హైదరాబాద్ లో షాప్ పెట్టాలనుకుంటే మీకు టాటా ఏస్ లాంటి వెహికల్ సరిపోతుంది. ఇది మీకు ఒక ట్రిప్పుకు 9 వేలు ఖర్చు అవుతుంది. ఇలా లేబర్, ఇతర ఖర్చులు కలిపి మీకు 13 రూపాయలకు మీకు వస్తుంది. కొంతమంది రైతులు చిన్న వ్యాపారులు రోజుకు మీకు 1000 కొబ్బరికాయ వరకు RTC బస్సు కు కూడా వేస్తారు. ఇది అయితే ఇంకా ఈజీ. ట్రాన్స్పోర్టేషన్ తగ్గటంవల్ల తక్కువలో కొబ్బరి కాయ మీకు దొరుకుతుంది.
కొట్టు ఎక్కడ పెట్టాలి:
మీరు కొబ్బరి కొట్టు ఎక్కడైనా పెట్టవచ్చు. గుడి వున్నా ప్రాంతాల్లో పెడితే కొంచెం ఎక్కువ రిటైల్ సేల్స్ ఉంటాయి. మీరు కిరాణా కొట్లతో డైరెక్ట్ డీలింగ్ పెట్టుకోండి. స్పాట్ కాష్ తో వ్యాపారం చేయండి. ఇంకా హోటల్స్ కు కూడా సప్లై చెయ్యండి. గేటెడ్ కమ్యూనిటీలను టార్గెట్ చేయండి. హోటల్స్ కు, కిరాణా షాపులకు మీరు నెలకి ఇన్ని కాయలు అని హోల్ సేల్ గా అమ్మవచ్చు. కాకపోతే ఎక్కడ క్రెడిట్ బిజినెస్ లు చెయ్యకుండా ఉంటే బెటర్. రిటైల్ లో కొబ్బరికాయ మీకు 30 రూపాయలకు కూడా కొంటారు. కానీ హోల్ సేల్ లో మీకు కాయమీద పెద్ద లాభం రాదు. కానీ ఎక్కువ మొత్తంలో అమ్మటంవల్ల మీకు రొటేషన్లో ప్రాఫిట్ వస్తుంది. స్టార్టింగ్ లో మీరు ఒక 30 వేలు కాయతో మొదలుపెట్టండి. హోల్ సేల్ రిటైల్ కలిపి మీకు నెలకు ఎలా లేదన్న ఒక 50 వేలు లాభం పక్కా. హోల్ సేల్ కాయ కేవలం రూపాయి లాభానికి అమ్మితే, రిటైల్ లో 3 రూపాయలు లాభాన్ని అనుకున్నా మీకు 50 వేలు లాభం పక్కా. ఇప్పుడున్న రిటైల్ రేట్లలో అయితే మీకు లాభం 1 లక్షకంటే ఎక్కువ ఉండొచ్చు. చిన్న కొట్టు సరిపోతుంది కాబట్టి రెంట్ తక్కువ ఉండే కొట్టు వెతకండి. అది రెసిడెన్షియల్ ఏరియాలో సరుకు స్టాక్ చేసుకునేలా ఉంటే సరిపోతుంది. అదే మీరు టెంపుల్ ఏరియా లో పెడితే మాత్రం రెంట్ ఎక్కువ ఉంటుంది కానీ లాభాలు కూడా అలానే ఉంటాయి. ఇంకా వినాయక చవితి లాంటి పండుగల టైం లో మీకు అమ్మకాలు విపరీతంగా ఉంటాయి.
ముఖ్యమైన సలహాలు:
సరుకు ఎవరు ఇస్తున్నారు అనేది చాలా ముఖ్యం. అందుకే సప్లయర్ మీకు సరిగా ఉండాలి. అందుకే సరిగా రీసెర్చ్ చేసి నలుగురితో కాంటాక్ట్ పెట్టుకోండి. ఒకరు సరిగా సరుకు ఇవ్వకపోయినా మీకు ఇబ్బంది ఉండకూడదు. స్టార్టింగ్ లో రెగ్యులర్ గా వెళ్లి హోల్ సేల్ వ్యాపారులను కలవండి. ఎవరికీ అడ్వాన్స్ గా పూర్తి మొత్తాలు ఇవ్వవద్దు. సరుకు క్వాలిటీ, కొబ్బరికాయ సైజు చాలా ముఖ్యం. అందుకే సప్లయర్ మిమ్మల్ని మోసం చెయ్యకుండా జాగ్రత్త పదండి. ఇది సీజన్లో బట్టి కొబ్బరి కాయ ధరలో మార్పులు వస్తుంటాయి. ఒక్కోసారి కొబ్బరి ధర 5 రూపాయలకు కూడా పడిపోతుంది. ఒక్కోసారి 20 రూపాయలు కూడా పలుకుతుంది. దీనిబట్టి మీ లాభాల్లో మార్పులుంటాయి. అయితే పెద్ద నగరాల్లో రిటైల్ ధర ఎపుడైనా 25 రూపాయలు పై మాటే. అందువల్ల సరిగా మార్కెట్ ను అర్థం చేసుకోగలిగితే మీకు లాభం పక్కా వస్తుంది.
మార్కెట్ లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. అది తీసుకునే విధానం మీకు తెలిస్తే మీరే కింగ్. ఎప్పుడైనా సరిగా చూడండి. మన వీధి చివర్లో ఒక మెడికల్ షాప్, రెండు కిరాణా కొట్లు, ఒక వెజిటల్ షాప్ ఇలా కొన్నే ఉంటాయి. మీరు ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పే మాట బిజినెస్ లో ఏమీ మిగలడం లేదు… వ్యాపారం అనవసరం అని… కానీ అతను ఎందుకు చేస్తున్నాడు లాభం లేకుండా..? ఆలోచిస్తే అదే వ్యాపార రహస్యం. నెలకు 50 వేలు వచ్చే వ్యాపారం నుండి, కోట్లు సంపాదించే వ్యాపారి అయినా చెప్పే మొదటి మాట మార్కెట్ బాలేదు అని. సో మీరు వ్యాపారం చెయ్యాలంటే మార్కెట్ ని అర్థం చేసుకోండి. డిమాండ్ అంచనా వెయ్యండి. వ్యాపారంలోకి దిగండి.
DISCLAIMER : ఈ బిజినెస్ ఐడియా కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఇచ్చిన పెట్టుబడి వివరాలు కేవలం అంచనా మాత్రమే. వాస్తవం లో వాటి ధరల్లో ఎక్కువ తక్కువ మార్పులు ఉండవచ్చు. ఇది వ్యాపారానికి ఇచ్చే సలహా కాదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు మీ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి.
































