సనాతన ధర్మంలో మహాకుంభానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మహాపండుగలో గంగాస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ప్రయాగ్ రాజ్‌లో 12 పూర్ణ కుంభమేళా మహోత్సవానికి మహాకుంభ్ అని పేరు పెట్టారు.
ఈ మహా కుంభమేళా 12 పూర్ణ కుంభల్లో ఒకసారి జరుగుతుంది. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇందులో భాగంగా 2025 జనవరి 13న పుష్య పౌర్ణమి నాడు మహాకుంభమేళా ప్రారంభం కావడంతో తొలి రాజస్నానం జరిగింది. రెండో రాజస్నానం మకర సంక్రాంతి నాడు అంటే 2025 జనవరి 14న నిర్వహించారు. ఈ మహోత్సవం ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి రోజున ముగుస్తుంది. ఇకపోతే, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళకు వెళ్తున్న వారు తప్పక సందర్శించాల్సిన చారిత్రక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
ఆనంద్ భవన్: ఈ భవనం నెహ్రూ కుటుంబానికి పూర్వీకుల నివాసం. నెహ్రూ – గాంధీ కుటుంబానికి చెందిన నివాసం అయిన ఆనంద్ భవన్, పురాతన కట్టడాలను ఇష్టపడే వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఈ ప్రసిద్ధ భవనంలోనే భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన బాల్యాన్ని గడిపారు. ఇప్పుడు మ్యూజియంగా మార్చబడిన ఈ భవనంలో నెహ్రూ కుటుంబానికి చెందిన ఛాయాచిత్రాలు, పత్రాలు, వ్యక్తిగత వస్తువులు సందర్శన కోసం ఉంచారు. అంతేకాదు, అక్కడి నమూనాలు భారత స్వాతంత్య్ర పోరాట దశను కూడా కళ్లకు గట్టినట్లుగా చూపిస్తాయి. చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను మీరు ఇక్కడ చూడవచ్చు.
అలహాబాద్ కోట: ఈ కోట సంగం ఒడ్డున ఉంది. ఈ కోటను క్రీ.శ.1583లో అక్బర్ నిర్మించాడు. ఇక్కడ మీరు పాటల్‌పురి ఆలయం, అక్షయ మర్రి చెట్టును కూడా సందర్శించవచ్చు.
చంద్రశేఖర్ ఆజాద్ పార్క్: ఈ పార్కులో అమరవీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆజాద్ బ్రిటీష్ వారితో పోరాడుతూ ఇక్కడే వీరమరణం పొందాడు.
ఖుస్రో బాగ్: మీరు మహాకుంభ్‌కు వెళుతున్నట్లయితే, ఖుస్రో బాగ్‌ని తప్పకుండా సందర్శించండి. ఇక్కడ ఖుస్రో, చక్రవర్తి జహంగీర్, షా బేగం కుమారుడు సమాధులు ఉన్నాయి. మీరు ఖుస్రో బాగ్‌లో చరిత్రకు సంబంధించిన తీజ్‌ని ఇక్కడ మీరు చూస్తారు.
అలహాబాద్ యూనివర్సిటీ: ఇది భారతదేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల జాబితాలో చేర్చబడింది. అలహాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విక్టోరియన్, ఇస్లామిక్ నిర్మాణ శైలి భవనాలు చూడవచ్చు.