మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే..

బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి.. ఇటీవల కాలంలో ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత తగ్గాయి.. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో..


ఇటీవల దేశీయంగా తగ్గాయి.. ఈ క్రమంలోనే, గోల్డ్ ధరలు మళ్లీ పెరుగుతుండటంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా.. మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారంపై రూ.1,860 పెరిగింది. వెండి కిలోపై రూ.3వేలు పెరిగింది.

పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం (నవంబర్ 22 2025) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,860 మేర ధర పెరిగి.. రూ.1,25,840 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.1,700 మేర ధర పెరిగి.. రూ.1,15,350 గా ఉంది.

వెండి కిలోపై రూ.3వేల మేర ధర పెరిగి.. రూ.1,64,000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,840 ఉండగా.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,15,350 ఉంది.. కిలో వెండి ధర రూ.1,72,000 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,25,840, 22 క్యారెట్ల ధర రూ.1,15,350 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,72,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,25,990, 22 క్యారెట్ల ధర రూ.1,15,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,64,000 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,25,840, 22 క్యారెట్ల ధర రూ.1,15,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,64,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,26,880 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,16,300 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,72,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.