గత కొన్నిరోజుల నుంచి బంగారం ధర పెరుగుతోంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు, చైనా కొనుగోళ్లు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు ముందు అనిశ్చితి పరిస్థితులు, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల బంగారం ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు వివరించారు.
గత కొన్నిరోజుల నుంచి బంగారం (Gold) ధర పెరుగుతోంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు, చైనా కొనుగోళ్లు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు ముందు అనిశ్చితి పరిస్థితులు, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల బంగారం (Gold) ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు వివరించారు.
స్థిరమైన ఆస్తి
‘యూఎస్ ఫెడ్ ద్వారా ద్రవ్య విధాన సడలింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయ పరిస్థితి క్షీణించడంపై బెట్టింగ్ జరుగుతోంది. స్థిరంగా సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ఎన్నికల రావడంతో బంగారం కొనుగోలు స్థిరమైన ఆస్తిగా ప్రజలు భావిస్తున్నారు. రూపాయి విలువ తగ్గిపోవడం బంగారం ధర పెరిగేందుకు ఊతం ఇస్తోంది అని’ ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ ఫండర్ సుగంద అభిప్రాయ పడ్డారు.
ఇంట్రెస్ట్
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది. పెళ్లిళ్ల సమయంలో వధువు, వరుడు బంగారు ఆభరణాలు ధరిస్తారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. బంగారం వ్యాపారుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. బంగారం ధర పెరగడంతో కొనుగోలు దారుల సంఖ్య తగ్గిందని వివరించారు.
పెరిగేవి కావు..?
మధ్య ప్రాచ్య ప్రాంతంలో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం. అక్కడ ప్రశాంత పరిస్థితి ఉంటే బంగారం ధరలకు రెక్కలు వచ్చేవి కావని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య వివాదం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేపథ్యంలో బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ కారణాల చేత ఏడాదిలో బంగారం ధర 12 శాతం పెరిగిందని నిపుణులు వివరించారు.